Amazon Great Freedom Festival Sale: అమెజాన్ సేల్ వచ్చేస్తోంది.. ఏఏ వస్తువులపై ఎంతెంత డిస్కౌంట్ ఇస్తోందంటే..!

ABN , First Publish Date - 2023-08-01T18:09:06+05:30 IST

ఈ నెల 5 వ తేదీ నుండి 9వ తేదీ వరకు సాగే ఈ ఈ సేల్ కొనుగోలుదారులకు పెద్ద పండగే అనుకోవచ్చు. ఆగస్టు 4వ తేదీ అర్దరాత్రి ప్రారంభమయ్యే ఈ ఐదు రోజుల సేల్ లో..

Amazon Great Freedom Festival Sale: అమెజాన్ సేల్ వచ్చేస్తోంది.. ఏఏ వస్తువులపై ఎంతెంత డిస్కౌంట్ ఇస్తోందంటే..!

అమెజాన్ ప్రైమ్ సేల్ జూన్ 15,16 తేదీల్లో సందడి చేసింది. అది ముగిసి 20రోజులు కూడా గడవకుండానే ఇ-కామర్స్ దిగ్గజం అప్పుడే గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ కు సన్నద్దమవుతోంది. ఈ నెల 5 వ తేదీ నుండి 9వ తేదీ వరకు సాగే ఈ ఈ సేల్ కొనుగోలుదారులకు పెద్ద పండగే అనుకోవచ్చు. ఆగస్టు 4వ తేదీ అర్దరాత్రి ప్రారంభమయ్యే ఈ ఐదు రోజుల సేల్ లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లతో సహా ఎన్నో ఉత్పత్తులపై డిస్కౌంట్ లు అందుబాటులో ఉంటాయి. నిజానికి చాలామంది మొబైల్స్, ల్యాప్టాప్స్, వాషింగ్ మెషిన్స్, గ్యాస్ స్టౌవ్ లు, మిక్సీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్లు ఇలా బోలెడు గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి ఈ సేల్ కోసం ఎదురుచూస్తుంటారు కూడా. ఇప్పటికే ఆకర్షణీయమైన కొన్ని ఆఫర్స్ ను బయటకు రివీల్ చేస్తూ కస్టమర్లను ఊరిస్తోంది. ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నవారు 12గంటల ముందుగానే ఈ కొనుగోలు మొదలుపెట్టే అద్బుత అవకాశం కూడా ఉంది. ఇంతకూ ఈ సేల్ లో ఏఏ వస్తువులు ఎంత డిస్కౌంట్ లో లభ్యమవుతున్నాయో తెలుసుకుంటే..

గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్(Great Freedom Festival Sale) లో ఐదు వర్గాలలో సేల్స్ అందుబాటులో ఉంటుంది.. వీటిలో బ్లాక్ బస్టర్ డీల్స్, గ్రాండ్ ఓపెనింగ్ డీల్స్, నైట్ 8pm డీల్స్, అండర్ 999rs డీల్స్, ప్రైస్ క్యాష్ స్టోర్ ఉన్నాయి. వీటిలో మొబైల్ లు, యాక్సెసరీస్ పై 40శాతం తగ్గింపు ఉంది(40% discount on mobiles). ఇవి కూడా చిన్నా చితకా మొబైల్స్ ఏమీ కాదు ఏకంగా Apple iphone14, OnePlus Nord3,Samsung Galaxy M14 5G, Realme Narzo 60 Pro వంటి బడా బ్రాండ్ ఫోన్ లు కూడా మెరవబోతున్నాయి. ఇక కొత్తగా లాంచ్ కాబోయే Redmi 12 5G ఫోన్ కూడా ఈ సేల్ లో అందుబాటులో ఉంటుంది. వీటికి నో కాస్ట్ EMI(no cost EMI), పాత మొబైల్ ఎక్స్చేంజ్(old mobile exchange) వంటి సౌకర్యం కూడా ఉంది.

ITR Filing Last Date: వర్షాలు, కరెంట్ కోతలంటూ ఫిర్యాదులు.. ఐటీఆర్‌ దాఖలు చేసేందుకు సర్కారు మరో ఛాన్స్ ఇస్తుందా..?



బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ అయితే రూ. 5,999తో ప్రారంభమవుతాయి. మొబైల్ కవర్స్ చాలా తక్కువ ధరలో కేవలం 69రూపాయల నుండి అందుబాటులో ఉంటాయి. ఈ సేల్ లో ల్యాప్టాప్ లు, గేమింగ్ ల్యాప్టాప్ లపై 40శాతం తగ్గింపు ఉంటుంది. ఇందులో HP 15s రూ. 38,990, Dell Vostro 3420 ధర రూ.48,990 లతో ల్యాప్టాప్ లు అందుబాటులో ఉంటాయి. 60కి పైగా కొత్త వస్తువులు ఈ సేల్ లో లాంచ్ అవుతున్నాయి. 80శాతం తగ్గింపుతో స్మార్ట్ వాచ్ లు యూత్ ను అలరించబోతున్నాయి. అలాగే హెడ్ ఫోన్స్ కూడా 75శాతం తగ్గింపులో లభ్యమవుతాయి. ఆండ్రాయిడ్ టాబ్లెట్స్ పై 50శాతం తగ్గింపు ఉంటుంది. కెమెరాలపై 40శాతం, స్పీకర్లపై 75శాతం, కంప్యూటర్ ఉపకరణాలపై 75శాతం డిస్కౌంట్ ఉంటుంది. SBI క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ తో చేసే కొనుగోలు మీద 10శాతం తగ్గింపు కూడా ఉంటుంది(10% discount on SBI credit, debit card). ఇక క్యాష్ బ్యాక్ ఆఫర్లు, కూపన్లు, ఇర్రెసిస్టిబుల్ కాంబోలు ఇవన్నీ కలిసి ఈ సేల్ లో షాపింగ్ చేయడానికి మరింత ఉత్సాహాన్ని నింపుతాయి.

ITR Filing: జూలై 31వ తారీఖు లోపు ఐటీఆర్ దాఖలు చేయలేకపోయారా..? ఇప్పుడున్న ఏకైక ఆప్షన్ ఏమిటంటే..!


Updated Date - 2023-08-01T18:09:06+05:30 IST