Accenture: బాంబు పేల్చిన యాక్సెంచర్.. 19 వేల మంది ఉద్యోగులపై వేటు!

ABN , First Publish Date - 2023-03-23T20:59:21+05:30 IST

ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటివి ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ఉద్యోగులు రోడ్డున

Accenture: బాంబు పేల్చిన యాక్సెంచర్.. 19 వేల మంది ఉద్యోగులపై వేటు!

న్యూఢిల్లీ: ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్బణం వంటివి ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది ఉద్యోగులు రోడ్డున పడడానికి కారణమవుతున్నాయి. ఇప్పటికే పలు టెక్ కంపెనీలు వేలాదిమంది ఉద్యోగులను తొలగించాయి. ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణం, భవిష్యత్ ప్రణాళికలు.. వంటి కారణాలను సాకుగా చూపుతూ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా ఇంటికి పంపేశాయి. తాజాగా ఐర్లాండ్‌కు చెందిన ఐటీ దిగ్గజం యాక్సెంచర్(Accenture) ఈ జాబితాలో చేరింది. సంస్థలోని 2.5 శాతం అంటే దాదాపు 19 వేల మందిని ఉద్యోగులను తొలగించబోతున్నట్టు చెప్పింది. ఆర్థిక భారాన్ని తగ్గించుకునే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

దాదాపు సగం తొలగింపులు నాన్ బిల్లబుల్ కార్పొరేట్‌కు సంబంధించినవే ఉంటాయని పేర్కొంది. కంపెనీ వార్షిక ఆదాయ వృద్ధి 8 నుంచి 11 శాతం వరకు ఉంటుందని గతంలో అంచనా వేయగా, ఇప్పుడు దానిని 8-10 శాతంగా అంచనా వేస్తోంది. మరోవైపు, అమెరికాకు చెందిన జాబ్ సెర్చ్ ప్లాట్‌ఫామ్ 2,200 మందిని తొలగిస్తున్నట్టు బుధవారం ప్రకటించింది. కాగా, మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ట్విట్టర్, సేల్స్‌ఫోర్స్ వంటి పలు టెక్నాలజీ కంపెనీలు ఇప్పటికే వేలాదిమంది ఉద్యోగులను ఇంటికి పంపాయి.

Updated Date - 2023-03-23T21:39:16+05:30 IST