Share News

5DaysBanking: మళ్లీ ట్రెండ్ అవుతున్న 5 డేస్ బ్యాంకింగ్..ఖాతాదారుల కామెంట్లు

ABN , Publish Date - Dec 31 , 2023 | 04:17 PM

దేశంలో మళ్లీ 5 రోజుల బ్యాంకింగ్ పనిరోజులు కావాలనే హ్యాష్‌ట్యాగ్(#5DaysBanking) ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. ప్రభుత్వం వారికి గుడ్‌న్యూస్ చెప్పాలని బ్యాంక్ ఉద్యోగులు అనేక మంది సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

5DaysBanking: మళ్లీ ట్రెండ్ అవుతున్న 5 డేస్ బ్యాంకింగ్..ఖాతాదారుల కామెంట్లు

దేశంలో మళ్లీ 5 రోజుల బ్యాంకింగ్ పనిరోజులు కావాలనే హ్యాష్‌ట్యాగ్(#5DaysBanking) ట్విట్టర్లో ట్రెండ్ అవుతోంది. అయితే బ్యాంక్ ఉద్యోగులు తమకు ఐదు రోజుల పని మాత్రమే కల్పించాలని చాలా రోజులుగా బ్యాంక్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ప్రభుత్వ సంస్థలైన RBI, IRDAI, నాబార్డ్, DFS, BSE, NSEలలో కేవలం ఐదు రోజులు మాత్రమే పనిరోజులు ఉన్నట్లు గుర్తు చేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముఖగా ఉన్న బ్యాంకులు మాత్రం ఆరు రోజులు పనిచేస్తున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో తమకు కూడా ఐదు రోజుల పనిరోజులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక మంది బ్యాంక్ ఉద్యోగులు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో మద్దతుగా పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు.


2015 నుంచి ప్రతి నెల రెండవ, నాల్గవ శనివారాలను బ్యాంకులకు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. అయితే నెలలో ప్రతి శనివారం కూడా సెలవు ఇవ్వాలని బ్యాంక్ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం తరపున ఆర్థిక శాఖ సహాయమంత్రి రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో చెప్పినట్లు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే త్వరలో ప్రభుత్వం నుంచి వారికి గుడ్ న్యూస్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఐదు రోజుల పాటు బ్యాంకుల్లో(5DaysBanking) పని చేసేందుకు ఐబీఏ ఇప్పటికే ఆమోదం తెలిపింది. కానీ దీనికి ఇంకా ఆర్‌బీఐ, ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రాలేదు.

మరోవైపు బ్యాంక్ ఉద్యోగులకు ఐదు రోజులు మాత్రమే పనిదినాలు కల్పించే అంశంపై ఖాతాదారులు అనేక విధాలుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే ఈ ఉద్యోగులకు ఎక్కువగా పని ఉండదని వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు ప్రభుత్వ బ్యాంకులకు వచ్చిన ఖాతాదారులకు అక్కడి సిబ్బంది మంచి సర్వీస్ ఇవ్వరని పలువురు ఆరోపిస్తున్నారు. అనేక చోట్ల ప్రభుత్వ బ్యాంకుల్లో సిబ్బంది ఖాళీగా ఉంటూ కబుర్లు చెప్పుకుంటారని ఇంకొంత మంది అంటున్నారు. ఇలాంటి వారికి ఐదు రోజుల పనిరోజులు కల్పిస్తే బ్యాంకింగ్ సేవలు(banking services) ఎలా అందిరికీ అందుబాటులో ఉంటాయని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Dec 31 , 2023 | 04:22 PM