కొత్త ఇంటి పునాది తడుపుతుండగా..
ABN , First Publish Date - 2023-10-09T01:09:07+05:30 IST
సొంతింటి ఆనందం ఆవిరైంది.. ఇంటికి వాటరింగ్ చేస్తుండగా వైర్ల నుంచి విద్యుత్ ప్రవహించి ఓ వ్యక్తి మృతిచెందాడు.
కడియం, అక్టోబరు 8 : సొంతింటి ఆనందం ఆవిరైంది.. ఇంటికి వాటరింగ్ చేస్తుండగా వైర్ల నుంచి విద్యుత్ ప్రవహించి ఓ వ్యక్తి మృతిచెందాడు. కడియపులంక గ్రామానికి చెందిన కాకిలేటి చినవెంకన్న(56) ఇటీవల ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. తాపీ మేస్ర్తీలు పునాది వరకూ నిర్మించారు. ప్రతి రోజూ ఉదయం వచ్చి పునాది తడుపుతున్నాడు. రోజూలాగే ఆదివారం ఉదయం కూడా ఇంటివద్దకు చేరుకుని పునాది తడుపుతుండగా వైర్ల నుంచి విద్యుత్ ప్రవహించి ఒక్కసారిగా షాక్ కొట్టింది. దీంతో గట్టిగా అరిచిపడిపోయాడు. ఏం జరిగిందో స్థానికులకు అర్ధంకాలేదు. అపస్మారక స్థితితో ఉన్న వెంకన్నను వెంటనే స్థానికులు కడియం సీహెచ్‌సీకి తరలించారు.అయితే అప్పటికే వెంకన్న మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.