Global Investors Summit: కంపెనీల పేరుతో వైసీపీ ప్రభుత్వం భూమి దోపిడీకి సిద్ధమైంది: బొండా ఉమా

ABN , First Publish Date - 2023-03-06T20:56:47+05:30 IST

ఇటీవల జరిగిన విశాఖ సమ్మిట్‌ (Global Investors Summit)ను పరిశీలిస్తే వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున భూమి దోపిడీకి సిద్ధమైనట్లు తెలుస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు

Global Investors Summit: కంపెనీల పేరుతో వైసీపీ ప్రభుత్వం భూమి దోపిడీకి సిద్ధమైంది: బొండా ఉమా

విజయవాడ: ఇటీవల జరిగిన విశాఖ సమ్మిట్‌ (Global Investors Summit)ను పరిశీలిస్తే వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున భూమి దోపిడీకి సిద్ధమైనట్లు తెలుస్తోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బొండా ఉమా (Bonda Uma) విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే విశాఖ సమ్మిట్‌ను నిర్వహించి సీఎం జగన్‌ (CM Jagan) ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చినట్లు మాయాజాల సమ్మిట్‌ను నిర్వహించారని ఎద్దేవా చేశారు. గత టీడీపీ (TDP) ప్రభుత్వంతో కంపెనీలు రూ. 16 లక్షల కోట్లు ఒప్పందం చేసుకోగా వైసీపీ అధికారంలోకి రావడంతో జే ట్యాక్స్‌ కట్టలేక కంపెనీలన్నీ వెనక్కి వెళ్లిపోయాయన్నారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న ఎంఓయూల్లో ఒక్కటైనా విజయవంతం అయ్యే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. పెట్టుబడుల సమ్మిట్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రూ. 150 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. శాసన మండలి రద్దు చేస్తామన్న జగన్‌ సర్కార్‌కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా వైసీపీ దొంగ ఓట్లను సృష్టించిందని, కచ్చితంగా వాటిని అడ్డుకుంటామని, సదరు విషయంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా టీడీపీ విజయం సాధిస్తుందని బొండా ఉమా ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-06T20:56:47+05:30 IST