వైసీపీ వర్గ పోరుకు అధికారుల బలి !

ABN , First Publish Date - 2023-06-03T00:32:47+05:30 IST

పోలవరం నియోజక వర్గంలో వైసీపీ వర్గ రాజకీయాలు రోజు రోజుకు ముదురు తున్నాయి. వీటి మధ్య అధికారులు నలిగిపోతున్నారు.

వైసీపీ వర్గ పోరుకు   అధికారుల బలి !

కొయ్యలగూడెం ఎంపీడీవోను ఎందుకు బదిలీ చేస్తున్నట్లు..?

కొత్త అధికారిని తెచ్చుకునేందుకు తెరవెనుక యత్నాలు

పట్టు సాధించిన ఎంపీపీ.. చక్రం తిప్పిన మాజీ ఎంపీపీ

కొయ్యలగూడెం, జూన్‌ 2 : పోలవరం నియోజక వర్గంలో వైసీపీ వర్గ రాజకీయాలు రోజు రోజుకు ముదురు తున్నాయి. వీటి మధ్య అధికారులు నలిగిపోతున్నారు. తాజాగా కొయ్యలగూడెం ఎంపీడీవో నియామకం విష యంలో ఈ విభేదాలు రచ్చకెక్కాయి. ప్రస్తుత ఎంపీడీవో కృష్ణప్రసాద్‌ కాల పరిమితి ఐదేళ్లు పూర్తికాలేదు. కాని, ఆయనను వేరే చోటుకు బదిలీ చేయిస్తుండడం తీవ్ర చర్చ నీయాంశమైంది. ఎలాంటి కారణం లేకుండానే ఆయనను ఇక్కడి నుంచి ఎందుకు కదుపుతున్నారని మండల అధి కారులు, రాజకీయ వర్గాల్లో హాట్‌ టాఫిక్‌గా మారింది. ఈ విషయంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేను నిలదీసినట్టు సమాచారం. వర్గ రాజకీయాల కారణంగా బదిలీ అవుతు న్నట్టు తెలిసింది. మరోవైపు ఆ స్థానంలో తాను సూచిం చిన అధికారిని నియమించాలని ఓ ప్రజా ప్రతినిధి ఎమ్మె ల్యేపై ఒత్తిడి తెచ్చారు. మరో వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు తాము సూచించిన అధికారిని నియమించా లంటూ పట్టుబట్టారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేతోపాటు జిల్లా ఉన్నతాధికారులకు సిఫారసు లేఖల తాకిడి పెరిగిం ది. వీరిలో ఎవరిని నియమిస్తే ఏం జరుగుతుందోనన్న ఆందోళన అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఎంపీడీవో నియామక విషయమై శుక్రవారం ఉదయం ఎంపీపీ, ఇక్కడకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్న పలువురు ఎంపీడీవోలు ఎమ్మెల్యేను కలిశారు. ఎంపీపీ తొలుత తాను సూచించిన వ్యక్తినే ఎంపీడీవోగా నియమించాలని అభ్యర్థిం చినట్టు తెలిసింది. అయితే ఎమ్మెల్యే తనను కలిసేందుకు వచ్చిన ఎంపీడీవోల్లో ఒకరి పేరును సూచించమని కోరినట్టు సమాచారం. దీంతో ఎంపీపీ ఒక మహిళ ఎంపీడీవో పేరును సూచించి, ఆ మేరకు ఏలూరు వెళ్లి జడ్పీ సీఈవోను కలిసి ఆమెనే నియమించాలంటూ కోరినట్టు తెలిసింది. అదే ఎంపీడీవోను నియమించడంలో ఒక మాజీ ఎంపీపీ చక్రం తిప్పినట్టు సమాచారం.

Updated Date - 2023-06-03T00:32:47+05:30 IST