పట్టాభిపై వైసీపీ నాయకుల ఫిర్యాదు

ABN , First Publish Date - 2023-01-26T00:36:54+05:30 IST

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్‌పై ఆగిరిపల్లి మండల వైసీపీ నాయకులు బుధవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

 పట్టాభిపై వైసీపీ నాయకుల ఫిర్యాదు

ఆగిరిపల్లి, జనవరి 25 : టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్‌పై ఆగిరిపల్లి మండల వైసీపీ నాయకులు బుధవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 18న ఎన్టీఆర్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఈదుల గూడెంలో జరిగిన బహిరంగ సభలో పట్టాభిరామ్‌ నూజివీడు ఎమ్మెల్యే తనయుడు మేకా వేణుగోపాల అప్పారావుపై నిరాధారమైన ఆరోపణలు చేశారని, వచ్చే ఎన్నికల్లో చంటినాయన చీటీ చింపేస్తామని వ్యాఖ్యానించడంలో కుట్రకోణం ఉందన్నారు. చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు ఎస్‌ఐ చంటిబాబుకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-01-26T00:36:54+05:30 IST