ధూమపానం ప్రాణానికే ప్రమాదం

ABN , First Publish Date - 2023-05-31T23:36:18+05:30 IST

ధూమపానం ఎన్నో వ్యాధులకు కారణమని, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఏలూరు ఆర్డీవో కె.పెంచల్‌కిషోర్‌ అన్నారు.

ధూమపానం ప్రాణానికే ప్రమాదం
పొగాకు, ధూమపానం వల్ల అనర్ధాలపై అవగాహన ర్యాలీ

ఏలూరు క్రైం, మే 31: ధూమపానం ఎన్నో వ్యాధులకు కారణమని, ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఏలూరు ఆర్డీవో కె.పెంచల్‌కిషోర్‌ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా పొగాకు నియంత్రణ విభాగం ఆధ్వ ర్యంలో బుధవారం ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఆవరణలో ర్యాలీ ఆర్డీవో ప్రారంభించారు. పొగాకు ఉత్పత్తిదారులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. పొగాకు నిర్మూలనకు అందరూ భాగస్వాములు కావాలన్నారు. ఇన్‌చార్జి డీఎం హెచ్‌వో నాగేశ్వరరావు మాట్లాడుతూ ధూమపానం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు, రకరకాల క్యాన్సర్లు, అనేక వ్యాధులు వస్తున్నాయన్నారు. ఇన్‌చార్జి ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ (ఎన్‌సీడీ) డాక్టర్‌ ప్రియాంక మాట్లాడుతూ పొగాకు వినియోగానికి యువత ఎక్కువ బానిసలు అవు తున్నారని, మహిళల్లో కూడా పొగాకు వాడకం పెరుగుతున్నట్లు గణాంకాలు చెబు తున్నాయన్నారు. ఏలూరు సర్వజన ప్రభుత్వాసుపత్రి, ఏరియా ఆసుపత్రులలో పొగాకు మాన్పించు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయని ఆ కేంద్రాల్లో సైకాలజి స్టులు, కౌన్సిలర్లు ఉన్నారని తెలిపారు. టోల్‌ ఫ్రీ నెంబర్‌ 18004252024ను సంప్ర దించి ఉచిత కౌన్సెలింగ్‌ పొందవచ్చని సూచించారు. ఆసుపత్రి వద్ద నుంచి ర్యాలీ ఫైర్‌ స్టేషన్‌ వరకూ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి ఆర్‌ఎంవో పీఏఆర్‌ఎస్‌ శ్రీనివాసరావు, మానసిక వైద్య నిపుణులు డాక్టర్‌ సీహెచ్‌.వంశీకృష్ణ, డాక్టర్‌ ప్రసాదరెడ్డి, డాక్టర్‌ శ్రీకాంత్‌ పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:36:18+05:30 IST