వ్యసనాలు ప్రాణాంతకాలు

ABN , First Publish Date - 2023-05-31T23:17:21+05:30 IST

వ్యసనాలు ప్రాణాంతకాలు అని ధూమపానం అతి ప్రాణాంతకం అని ఆర్టీసీ డిపో మేనేజర్‌ కె.గిరిధర్‌ కుమార్‌ అన్నారు.

వ్యసనాలు ప్రాణాంతకాలు
పాలకోడేరులో ధూమపానంపై వైద్య సిబ్బంది అవగాహన ర్యాలీ

ఆర్టీసీ డిపో మేనేజర్‌ గిరిధర్‌కుమార్‌

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ ర్యాలీలు

భీమవరం, మే 31 (ఆంధ్రజ్యోతి) :వ్యసనాలు ప్రాణాంతకాలు అని ధూమపానం అతి ప్రాణాంతకం అని ఆర్టీసీ డిపో మేనేజర్‌ కె.గిరిధర్‌ కుమార్‌ అన్నారు. శ్రీవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ అ వగాహన సదస్సు, ఫ్లకార్డులతో ప్రదర్శన, ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వ హిం చారు. ఆయన మాట్లాడుతూ వ్యసనాలకు దూరంగా ఉండాలని శ్రీవిజ్ఞాన వేదిక ప్రజల్లో అవగాహన కల్పించడానికి చేస్తున్న కృషిని అభినందించారు లయన్స్‌ క్లబ్‌ కార్యదర్శి నరహరిశెట్టి కృష్ణ కార్యక్రమాన్ని పర్యవేక్షించగా, నిర్వాహకులు రంగసాయి ధూమపాన వ్యతిరేక ప్రతిజ్ఞ నిర్వహించారు.

భీమవరం క్రైం : పొగాకు ఉత్పత్తులైన సిగరెట్‌, ఖైనీ గుట్కా వాడకం ద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తి మరణాలు సంభవిస్తాయని ఎఆర్టీ సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఎం.గోవిందబాబు అన్నారు. విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షుడు అల్లు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సదస్సు నిర్వహించారు. అరసవల్లి ట్రస్ట్‌ అధ్యక్షుడు అరసవల్లి సుబ్రహ్మణ్యం, విజ్ఞాన వేదిక సేవా సంస్థ అధ్యక్షుడు అల్లు శ్రీనివాస్‌ మాట్లాడారు.

పాలకోడేరు : ధూమపానం కాల్చడం, పొగ పీల్చడం ద్వారా టీబీ వచ్చే అవకాశం ఉందని ధూమపానానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని పాలకోడేరు పీహెచ్‌సీ వైద్యుడు రంగం నాయుడు సూచించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని పాలకోడేరు పీహెచ్‌సీ పరిధిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. గొరగనమూడిలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్యురాలు హసిత, పీహెచ్‌ఎన్‌ కుమారి, సూపర్‌వైజర్లు శంకర్‌, అయ్యప్ప శ్రీనివాస్‌, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ఆకివీడు : టుబాకోతో ప్రాణాలకే ముప్పుని న్యాయవాది కొల్లి సతీష్‌ అన్నారు. బుధవారం మాదివాడ శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు అవగాహన కల్పించి మాట్లాడారు గ్రంథ పాలకురాలు కె.పార్వతి తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-05-31T23:17:21+05:30 IST