విద్యుదాఘాతంతో కూలీ మృతి

ABN , First Publish Date - 2023-05-27T00:19:21+05:30 IST

చిన్నంపేటలో విద్యుదాఘాతానికి గురై కొమ్ము ఆనందరావు (42) అనే వ్యవసాయ కూలీ శుక్రవారం మృతి చెందాడు. ఒక రైతు వద్ద కూలీగా పనిచేస్తున్న ఆనందరావు పామాయిల్‌ తోటలో నీరు పెట్టడానికి వెళుతూ ఫెన్సింగ్‌ దాటుతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

విద్యుదాఘాతంతో కూలీ మృతి

చాట్రాయి, మే 26: చిన్నంపేటలో విద్యుదాఘాతానికి గురై కొమ్ము ఆనందరావు (42) అనే వ్యవసాయ కూలీ శుక్రవారం మృతి చెందాడు. ఒక రైతు వద్ద కూలీగా పనిచేస్తున్న ఆనందరావు పామాయిల్‌ తోటలో నీరు పెట్టడానికి వెళుతూ ఫెన్సింగ్‌ దాటుతుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కర్రలకు కట్టి ఉన్న మోటారు సర్వీసు వైరు గాలికి ఫెన్సింగ్‌పై పడటం వల్ల విద్యుత్‌ ప్రసారమై విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఇన్‌చార్జి ఎస్సై వెంకటేష్‌ సిబ్బందితో వచ్చి శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టంకు తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నా రు. ఆనందరావు మృతితో చిన్నంపేటలో విషాదం ఛాయలు నెలకొన్నాయి.

రైతుల నిర్లక్ష్యం వల్లే మరణాలు : విద్యుత్‌ ఏఈ

కొందరు రైతుల నిర్లక్ష్యం వల్లే విద్యుత్‌ ప్రమాదాలు జరిగి అమాయకులు చనిపోతున్నారని విద్యుత్‌శాఖ ఏఈ సంజయ్‌ అన్నారు. చిన్నంపేట పామాయిల్‌ తోట ఫెన్సింగ్‌ దాటుతూ శుక్రవారం వ్యవసాయ కూలీ కొమ్ము ఆనందరావు మృతి చెందగా, సంఘటనా స్థలాన్ని ఏఈ పరిశీలించి మాట్లాడుతూ సదరు రైతు మోటారు విద్యుత్‌ సర్వీస్‌ వైరు కర్రలకు కట్టి లాగారని ఇది గాలికి పడిపోయి ఫెన్సింగ్‌కు విద్యుత్‌ సరఫరా కావడంతో ప్రమాదం జరిగిందన్నారు. చాలా మంది రైతులు ఇలాగే సర్వీస్‌ వైర్లు లాగటం వల్ల ఫెన్సింగ్‌కు కరెంట్‌ సరఫరా జరిగి మరణాలు సంభవిస్తున్నాయన్నారు. కర్రలపై సర్వీస్‌ వైర్లు లాగిన రైతులు వెంటనే వాటిని తొలగించాలని కోరారు.

Updated Date - 2023-05-27T00:19:21+05:30 IST