రోడ్డు ప్రమాదంలో ముఠా కార్మికుడి మృతి
ABN , Publish Date - Dec 31 , 2023 | 01:11 AM
నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద రెండు లారీలు ఢీకొని ముఠా కార్మికుడు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసు కుంది.
నూజివీడు టౌన్, డిసెంబరు 30: నూజివీడు మండలం గొల్లపల్లి వద్ద రెండు లారీలు ఢీకొని ముఠా కార్మికుడు మృతి చెందిన ఘటన శనివారం చోటుచేసు కుంది. హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు వైపు వస్తున్న పీడీఎస్ లారీ, నూజివీడు వైపు నుంచి వస్తున్న మరో లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో పీడీఎస్ లారీలో బియ్యం దిగుమతికి వెళుతున్న ముఠా కార్మికుడు రోశయ్య (45) తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పీడీఎస్ బియ్యం అన్‌లోడ్ నిమిత్తం మొత్తం నలుగురు ముఠా కార్మికులు లారీలో వెళుతున్నారు. అలాగే ఈ ఘటనలో లారీ డ్రైవర్లతో పాటు క్లీనర్లు గాయ పడ్డారని వారిని నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నూజివీడు రూరల్ ఎస్సై టి.రామకృష్ణ తెలిపారు. మృతుడు రోశయ్యది సుంకొల్లు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.