మహిళల రక్షణకు చట్టాలు
ABN , First Publish Date - 2023-11-20T00:00:46+05:30 IST
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం మహిళా దినోత్సవం నిర్వహించారు. మహిళలకు రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు.

గ్రంథాలయ వారోత్సవాల్లో ప్రత్యేక సదస్సులు
ఏలూరు టూటౌన్ / క్రైం, నవంబరు 19: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం మహిళా దినోత్సవం నిర్వహించారు. మహిళలకు రక్షణ చట్టాలపై అవగాహన కల్పించారు. సెంటాన్స్, సెంట్ థెరిస్సా కళాశాల విద్యార్థులకు దిశ చట్టంపై అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. దిశా ఎస్సై వి.క్రాంతిప్రియ మహిళలపై జరుగు తున్న అఘాయిత్యాలను వివరించారు. అపరిచిత వ్యక్తులతో స్నేహం చేసి భవిష్యత్ పాడుచేసుకోవద్దని హితవుపలికారు. ఆపదలో ఉన్నప్పుడు 100, 112 నెంబర్లకు డయల్ చేయాలన్నారు. మహిళల రక్షణకు 1100 నెంబరుకు డయల్ చేయాలన్నారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు మహిళా కానిస్టేబుల్, పురుష కానిస్టేబుల్ డ్యూటీలో ఉంటారని, ఆపదలో ఉన్న వారికి అండగా ఉంటారన్నారు. మొబైల్‌లో దిశా యాప్ డౌన్‌లోడ్ చేసు కోవాలన్నారు. అనంతరం జనరల్ నాలెడ్జ్‌పై క్విజ్ నిర్వహించారు. దిశ చట్టంపై వ్యాసరచన పోటీలు జరిగాయి. గ్రంథాలయ కార్యదర్శి శేఖర్‌బాబు, అసిస్టెంట్ లైబ్రేరియన్లు నారాయణరావు, సందీప్‌కుమార్, ఉపాధ్యాయులు నీలిమ, శ్రీవల్లి, చలసాని పెప్సీ, రమేష్, అస్లాంభాష, రోజామణి, బీవీ లక్ష్మి పాల్గొన్నారు.
ఏలూరు ఎడ్యుకేషన్: బాలల గ్రంథాలయంలో ఆదివారం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దిశ చట్టం, మహిళా సాదికారతపై చర్చ నిర్వ హించారు. ఇన్నర్‌వీల్ క్లబ్ అధ్యక్షురాలు పీఎస్.లక్ష్మి, కార్యదర్శి జి.అచ్యుత మా ట్లాడుతూ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాందీ జయంతి సందర్భంగా ఏటా నవంబరు 19న మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నామన్నారు. విద్యార్దులకు దేశభక్తి గీతాలపోటీని నిర్వహించి, విజేతలకు బహుమతులను అందజేశారు. గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సోమవారం జరుగుతుందని లైబ్రేరియన్ ఎం.శోభ తెలిపారు. సంగీతం టీచరు టి.నళిని పాల్గొన్నారు.
లింగపాలెం: ధర్మాజీగూడెం శాఖా గ్రంథాలయంలో దిశ చట్టం, మహిళా సాధికారితపై విద్యార్ధినులతో చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రంథాలయ కమిటీ సభ్యులు చీదెళ్ళ నాగజ్యోతి మహిళా సాధికారిత గురించి విద్యార్ధినులకు వివరించడంతో పాటు విద్యార్థులకు లెమన్ అండ్ స్పూన్, ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో గణిత ఉపాధ్యాయులు ఎవి నారాయణ, సిహెచ్‌వి రమణ, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.