తాగొచ్చి వేధిస్తున్నాడని..

ABN , First Publish Date - 2023-01-18T00:17:18+05:30 IST

భార్యా భర్తల మధ్య జరిగిన ఘర్షణలో భర్త చని పోయాడు. తాగొచ్చి వేధిస్తున్న భర్తను పంటచేలోకి తోసేయడంతో మృతి చెందాడు. దీనికి సంబంధించిన వివరాలు తణుకు సీఐ ఆంజనేయులు తెలిపారు.

 తాగొచ్చి వేధిస్తున్నాడని..

అత్తిలి, జనవరి 17: భార్యా భర్తల మధ్య జరిగిన ఘర్షణలో భర్త చని పోయాడు. తాగొచ్చి వేధిస్తున్న భర్తను పంటచేలోకి తోసేయడంతో మృతి చెందాడు. దీనికి సంబంధించిన వివరాలు తణుకు సీఐ ఆంజనేయులు తెలిపారు. ఉండి మండలం అజ్జమూరుకు చెందిన పసుపులేటి ఆంజనేయులకు 20 సంవత్సరాలు కిత్రం దేవీ నాగ సుజాతతో వివాహం జరిగింది. వారికి పదేళ్ల కుమారుడు ఉన్నాడు. తాపీ పని చేసే ఆంజనేయులు మద్యానికి బానిసై భార్యను వేధించే వాడు. సంక్రాంతి సందర్భంగా అత్తిలి మండలం ఈడూరు అత్తారింటికి వచ్చాడు. తన భార్య చెల్లెలు, అతని భర్త కూడా రావడంతో వారు వెళ్లిపోవాల్సిందిగా ఆంజనేయులు గొడవ చేశాడు. సోమవారం సాయంత్రం వారు వెళ్లిపోవడంతో అత్తగారు అల్లుడిని తిట్టడంతో ఆమెను కొట్టాడు. దీంతో భార్య ఆగ్రహించి అతడిని తోసి వేయడంతో పంటచేలో పడి పోయాడు. పక్కనే ఉన్న సిమ్మెంటు రాయి తగలడంతో గాయపడ్డాడు. పక్కనే ఉన్న రాయితో అతని తలపై కొట్టి భార్య ఇంట్లోకి వెళ్లిపోయింది. తెల్లవారేసరికి ఆంజనేయులు మృతిచెంది ఉన్నాడు. దీనిపై ఆంజనేయులు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎస్‌ఐ కేసీఏ స్వామి, సీఐ పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు. ఎస్‌పీ రవిప్రకాష్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Updated Date - 2023-01-18T00:17:20+05:30 IST