తీరంలో భారీ తాబేలు కళేబరం

ABN , First Publish Date - 2023-02-11T00:10:29+05:30 IST

పేరుపాలెం సాగర తీరంలో శుక్రవారం మృతి చెందిన తాబేలు కొట్టు కొచ్చింది. సుమారు 20 కిలోలు పైబడి ఉంటుందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.

 తీరంలో భారీ తాబేలు కళేబరం

మొగల్తూరు, ఫిబ్రవరి 10 : పేరుపాలెం సాగర తీరంలో శుక్రవారం మృతి చెందిన తాబేలు కొట్టు కొచ్చింది. సుమారు 20 కిలోలు పైబడి ఉంటుందని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. తాబేలు కళేబరాన్ని స్థానికులు, బీచ్‌ సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. కాగా ఇటీవల తరచూ చనిపోయిన పెద్ద పెద్ద చేపలు, తాబేళ్లు ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. సముద్రంలో కలుషిత జలాలే కారణమన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Updated Date - 2023-02-11T00:10:31+05:30 IST