మూణ్ణాళ్ల ముచ్చట

ABN , First Publish Date - 2023-02-12T00:29:01+05:30 IST

భీమవరం–గరగపర్రు రహదారిలో ఇటీవల రైల్వే అండర్‌ టన్నెల్‌ లెవెల్‌ క్రాసింగ్‌ను నిర్మించారు. దానిని రెండు నెలలు క్రితం కేంద్ర మంత్రి మురళీధరన్‌ ప్రారంభించారు.

మూణ్ణాళ్ల ముచ్చట
గరగపర్రు రోడ్డులోని అండర్‌ టన్నెల్‌లో నిలిచిన మురుగు నీరు

భీమవరం క్రైం, ఫిబ్రవరి 11 : భీమవరం–గరగపర్రు రహదారిలో ఇటీవల రైల్వే అండర్‌ టన్నెల్‌ లెవెల్‌ క్రాసింగ్‌ను నిర్మించారు. దానిని రెండు నెలలు క్రితం కేంద్ర మంత్రి మురళీధరన్‌ ప్రారంభించారు. టన్నెల్‌ నెలరోజుల పాటు బాగానే ఉన్నా ఇటీవల అందులో మోకాలు లోతు వరకు మురుగునీరు నిలిచిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే వర్షాకాలంలో పరిస్థితి ఏంటి అని వారు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - 2023-02-12T00:29:02+05:30 IST