బైపాస్‌కు భూములిచ్చిన రైతులకు న్యాయం

ABN , First Publish Date - 2023-01-18T00:06:24+05:30 IST

వశిష్ఠ వారధి బైపాస్‌ రోడ్డుకు భూములిచ్చిన రైతులకు పరిహారంలో చెల్లింపులో న్యాయం చేస్తామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, జేసీ మురళి హామీలిచ్చారు.

బైపాస్‌కు భూములిచ్చిన రైతులకు న్యాయం
రైతులతో చర్చిస్తున్న చీఫ్‌ విప్‌ ముదునూరి, జేసీ మురళి

నరసాపురం రూరల్‌, జనవరి 17: వశిష్ఠ వారధి బైపాస్‌ రోడ్డుకు భూములిచ్చిన రైతులకు పరిహారంలో చెల్లింపులో న్యాయం చేస్తామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు, జేసీ మురళి హామీలిచ్చారు. మండలంలోని వైఎస్‌పాలెం గ్రామంలోని పితానిమెరకలో భూములు కోల్పోతున్న రైతులతో మంగళవారం సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా దిండి నుంచి సఖినేటిపల్లి, రాజుల్లంక, లక్ష్మణేశ్వరం, వైఎస్‌పాలెం, సీతారామపురం మీదుగా 216 జాతీయ రహదారిని కలుపుతూ రోడ్డును నిర్మిస్తారన్నారు. రైతులు సహకరించాలని, వారు అంగీకరించిన తర్వాతే పరిహారం అందిస్తామన్నారు. ఏఎంసీ మాజీ ఉపాధ్యక్షుడు యర్రంశెట్టి బాబులు మాట్లాడుతూ గ్రామంలోని 70 మంది రైతులు ఎదుర్కొం టున్న సమస్యలను వివరించారు. సబ్‌ కలెక్టర్‌ సూర్యతేజ, తహసీల్దార్‌ ఫాజిల్‌ పాల్గొన్నారు.

–––––––––

Updated Date - 2023-01-18T00:06:25+05:30 IST