గూట్లపాడు హెచ్‌ఎంపై విచారణ

ABN , First Publish Date - 2023-01-06T23:52:51+05:30 IST

గూట్లపాడు మండల పరిషత్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.శివజ్యోతిని శుక్రవారం విద్యాశాఖాధికారులు విచారణ చేశారు.

 గూట్లపాడు హెచ్‌ఎంపై విచారణ

భీమవరం రూరల్‌, జనవరి 6 : గూట్లపాడు మండల పరిషత్‌ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి.శివజ్యోతిని శుక్రవారం విద్యాశాఖాధికారులు విచారణ చేశారు. గతంలో శివజ్యోతి పాఠశాల పక్కనే ఉన్న అంగన్‌వాడీ కేంద్రంలో పనిచేస్తున్న దాసి లక్ష్మీ ప్రసన్నను కులం పేరుతో దూషించినట్టు ఆరోపణలున్నా యి. దీనిపై అదే కేంద్రంలో పనిచేస్తున్న సత్యవాణి ప్రశ్నించగా శివజ్యోతి వారిద్దరి సెల్‌ఫోన్‌లు లాక్కొకున్నట్టు గతంలో విద్యాశాఖ ఉన్నతాధికారులకు బాధితులిద్దరు ఫిర్యాదు చేశారు. ఈక్ర మంలో తాడేపల్లిగూడెం, భీమవరం డీవైఈవోలు రవీంద్ర, భార తీ శ్రీరామ్‌ ఇరు వర్గాలను, విద్యార్థులను విచారించారు. ఐసీడీ ఎస్‌ ప్రాజెక్టు అధికారిణి వాణి విజయరత్నం ఉన్నారు.

Updated Date - 2023-01-06T23:52:55+05:30 IST