పశ్చిమలోకి గణపవరం

ABN , First Publish Date - 2023-02-17T00:31:11+05:30 IST

పశ్చిమ గోదావరి జిల్లాలో గణపవరం మండలం విలీనమైంది. పరిపాలన సౌలభ్యం, ఆ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని విలీనం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

పశ్చిమలోకి గణపవరం

తాడేపల్లిగూడెం డివిజన్‌లో కలయిక..

ఇక జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్‌లు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

పశ్చిమ గోదావరి జిల్లాలో గణపవరం మండలం విలీనమైంది. పరిపాలన సౌలభ్యం, ఆ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని విలీనం చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో గణపవరం మండ లాన్ని ఏలూరు జిల్లాలో కలపడాన్ని జీర్ణించుకోలేక పోయిన మండల ప్రజలకు ఊరట నిచ్చినట్టయ్యింది. జిల్లా కేంద్రమైన భీమవరం, వాణిజ్య కేంద్రమైన తాడేపల్లిగూడెం పట్టణాలకు ఈ మండల గ్రామాలు చేరువుగా ఉంటాయి. తమ అవసరాలకు ఈ రెండు పట్టణాలపైనే ఆధారపడుతుం టారు. స్థానికులు తొలినుంచి గణపవరం మండలాన్ని పశ్చిమలో కలపా లంటూ విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. చివరకు ప్రభుత్వం విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఊహించినట్టుగానే ఈ మండలాన్ని తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్‌లో కలిపింది. పశ్చిమ గోదావరిలో విలీనం చేస్తూ ఒకటి, మరోవైపు కొత్తగా తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ మరొకటి ఏకకాలంలో రెండు గెజిట్‌ నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. ఇకపై జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్‌ల ద్వారా పాలన అందించనున్నారు. భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్‌లను ప్రస్తావిస్తూ వాటిలో ఉండే మండలాలను ప్రభుత్వం నిర్ధారించింది. గణపవరంతో కలిపి జిల్లాలో ఉన్న 20 మండలాలను మూడు రెవెన్యూ డివిజన్‌లకు సర్దుబాటు చేశారు.

అభ్యంతరాల స్వీకరణకు 30 రోజుల గడువు..

గతంలోనే గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేసేందుకు అభ్యంతరాలు స్వీకరించారు. ఆ మేరకు విలీనం చేస్తూ ఇటీవల మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. ఆ మేరకు తాజా నోటిఫికేషన్‌ విడు దల చేశారు. దాంతో విలీన ప్రక్రియ పూర్తయ్యింది. అయితే సాంకేతిక ఇబ్బం దులు లేకుండా ఉండేందుకు భీమవరం రెవెన్యూ డివిజన్‌లో కలుపుతూ నోటి ఫికేషన్‌ ఇచ్చారు. మరోవైపు పశ్చిమలోని రెవెన్యూ డివిజన్ల పునర్‌వ్యవ స్థీకరణలో భాగంగా గణపవరం మండలాన్ని తాడేపల్లిగూడెం డివిజన్‌లో చేర్చారు. భీమవరం, నర్సాపురం డివిజన్‌ల ద్వారా ఇప్పటి వరకు పాలన అందించారు. ఇప్పుడు కొత్తగా తాడేపల్లిగూడెం రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటు చేశారు. కొత్త డివి జన్‌లో వచ్చే మండలా లను నిర్ధారించారు. ప్రజలనుంచి అభ్యంత రాలు స్వీకరించేందుకు నెల రోజుల గడువు ఇచ్చారు. జిల్లా కలెక్టర్‌కు విన్నవించు కోవాల్సి ఉంటుంది. తదుపరి తుది నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఇదికూడా లాంఛన ప్రాయమేనని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ డివిజన్ల పునర్‌వ్యవస్థీకరణలో గణప వరం మండలాన్ని తాడేపల్లిగూడెం డివిజన్‌లో కలవనుంది. .

రెవెన్యూ డివిజన్‌ మండలాలు

భీమవరం భీమవరం, వీరవాసరం, ఉండి,

పాలకోడేరు, కాళ్ల, ఆకివీడు

నరసాపురం నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు,

యలమంచిలి, ఆచంట,

పెనుగొండ, పెనుమంట్ర, పోడూరు

తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెం, పెంటపాడు, అత్తిలి,

తణుకు, ఇరగవరం, గణపవరం

గ్రామాల్లో ప్రజల హర్షం..

గణపవరం : ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేయడంతో మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మా ఆకాంక్ష నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ఆకాంక్షలు నెరవేరాయి..

గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలో విలీనం చేయడంతో ప్రజల ఆకాంక్షలు నెరవేరాయి. మండలానికి దగ్గర్లో జిల్లా కేంద్రం ఉండడం వల్ల విద్యా, వైద్య, ఇతర సేవలు పొందేందుకు దోహదపడుతుంది.

– కాళ్ళకూరి సత్యనారాయణమూర్తి, సరిపల్లె

జిల్లాలో కలపడం సంతోషం..

పశ్చిమంలో విలీనం చేస్తామన్న ఇచ్చిన హామీ ప్రభు త్వం నిలబెట్టుకోవడం సంతోషంగా ఉంది. మండల ప్రజల ఆకాంక్షలు నెరవేరాయి. భీమవరం లేదా తాడేపల్లిగూడెం డివిజన్‌... ఏ డివిజన్‌లో కలిసిన దూరభారం ఒకటే.

ఎంవీ రామరాజు, రిటైర్డ్‌ టీచర్‌, గణపవరం

Updated Date - 2023-02-17T00:32:45+05:30 IST