అలంపురం పంచాయితీ!

ABN , First Publish Date - 2023-02-07T00:14:30+05:30 IST

పెంటపాడు మండలంలో అలంపురం మేజర్‌ గ్రామ పంచాయతీ. మహిళా సర్పంచ్‌ తాతపూడి ప్రగతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె ఎస్సీ రిజర్వేషన్‌లో ఎన్నికయ్యారు. ఈ కారణమో ఏమో తెలియదు గాని సర్పంచ్‌కు అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది.

అలంపురం  పంచాయితీ!

ఎస్సీ రిజర్వేషన్‌లో ఎన్నికైన మహిళా సర్పంచ్‌

అప్పు చేసి అభివృద్ధి పనులు.. బిల్లులకు కొర్రీ

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం పాలకవర్గ తీర్మానాలకు విలువ లేదు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

పెంటపాడు మండలంలో అలంపురం మేజర్‌ గ్రామ పంచాయతీ. మహిళా సర్పంచ్‌ తాతపూడి ప్రగతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె ఎస్సీ రిజర్వేషన్‌లో ఎన్నికయ్యారు. ఈ కారణమో ఏమో తెలియదు గాని సర్పంచ్‌కు అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. పంచాయతీ పాలకవర్గ తీర్మానాలకు విలువ లేకుండా పోతోంది. చేసిన పనులకు బిల్లులు మంజూరు కావడం లేదు. సొంత సొమ్ములు వెచ్చించి పంచాయతీలో పనులు నిర్వహించాల్సి వస్తోంది. మంచినీటి సరఫరాలో క్లోరినేషన్‌ చేయడానికి బ్లీచింగ్‌కు డబ్బులు ఖర్చు పెట్టలేని స్థితిలో పంచాయతీ ఉంది.

అలంపురం పంచాయతీలో అధి కారుల తీరు విమర్శలకు దారి తీస్తోంది. సర్పంచ్‌, పాలకవర్గం కనుసన్నల్లో పనిచేయాల్సిన కొందరు అధికారులు కాలరెగరేస్తున్నారన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. కారణాలేవైనా క్షేత్ర స్థాయిలో అధికార యంత్రాంగం నుంచి సర్పంచ్‌కు ఆది నుంచి కష్టాలు ప్రారం భమయ్యాయి. పెంటపాడులో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్‌ ఈవోను అలంపురం పంచా యతీకి ఇన్‌ఛార్జిగా నియమించారు. పాలకవర్గంలో తీర్మానించిన ప్రతిపాదనలకు మోక్షం లభించడం లేదు. ఆర్థిక సంఘం నిధులు మురుగుపోతాయని మొర పెట్టుకున్నా పట్టించుకునే నాథుడు లేడు. దీనిపై జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశారు. జిల్లా కలెక్టర్‌ స్పందనలోనూ వినతి పత్రం సమర్పించారు. అయినా ఫలితం లేదు. గ్రామంలో కనీస వసతులు కల్పించలేని నిస్సహాయ స్థితిలో పాలకవర్గం ఉంది.

నిధులు పుష్కలం

పంచాయతీకి నిధులు పుష్కలంగా ఉన్నాయి. ఆస్తిపన్నుతో పాటు, ఆర్థిక సంఘం నిధులు మొత్తం రూ.1.03 కోట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ నిధుల తో గ్రామంలోని పది వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి పాలకవర్గం తీర్మానించింది. వాటిపై ప్రతిపాదనలు రూపొందించి అంచనాలు రూపొందించా ల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ ఈ బాధ్యతను నెరవేర్చడం లేదు. పంచాయతీ తీర్మానం చేసినా పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం సానుభూతి పరు రాలు కావడంతోనే సర్పంచ్‌ మాటను అధికారులు లెక్క చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఇతర పంచాయ తీల్లో టీడీపీ సానుభూతి పరులు సర్పంచ్‌లుగా ఉన్నా ఈ పరిస్థితి లేదు. అలంపురంలో మాత్రమే ఎస్సీ రిజర్వే షన్‌లో ఎన్నికైన మహిళా సర్పంచ్‌కు తొలినుంచి కష్టాలే ఎదురవుతున్నాయి. నిధులున్నా అభివృద్ధి చేయలేని నిస్సహాయత సర్పంచ్‌ది. సహకరించాల్సిన అధికారులు ఉద్దేశ పూర్వకంగానే ఇబ్బందులు పెడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పన్ను వేయరేం..?

జాతీయ రహదారిని ఆనుకుని పంచాయతీ ఉంది. తాడేపల్లిగూడెం సమీపంలో ఉండడంతో వ్యాపార సముదాయలు వెలిశాయి. ఇటీవల దాదాపు 175 నిర్మాణాలు చేపట్టారు. అందులో వాణిజ్య సముదా యాలు, గోదాములు ఉన్నాయి. నివాసాలు ఏర్పడ్డాయి. సదరు నిర్మాణాలపై పన్నులు వేయాలంటూ యజ మానులు పంచాయతీని సంప్రదిస్తున్నారు. అయినా సిబ్బంది పన్నులు వేయడం లేదంటూ సర్పంచ్‌ వాపోతున్నారు. దీనివల్ల పంచాయతీకి ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. భవిష్యత్తులో నిర్మాణదారులు జరిమానాతో సహా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.

వేలం పాటల్లేవ్‌..

గ్రామంలో నిర్వహించే సంత, చెరువు గట్లపై పచ్చగడ్డికి వేలం పాటల ద్వారా వేల రూపాయలు పంచాయతీకి ఆదాయం లభిస్తుంది. అయితే వీటికి వేలంపాటలు నిర్వహించడం లేదు. జలజీవన్‌లో కుళాయి కనెక్షన్‌లు వస్తాయంటూ అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు గ్రామంలో అనధికారి కంగా కొన్ని కనెక్షన్‌లు ఇచ్చి గ్రామస్థుల నుంచి రూ.2,500 చొప్పున వసూలు చేశారు. పంచాయతీకి మాత్రం కట్టలేదు. వాస్తవానికి జలజీవన్‌లో రూ.70 లక్షలు వస్తాయని పంచాయతీ ఆశించింది. ఇప్పటి వరకు రాలేదు. దాంతో సొమ్ములు కట్టించుకుని కుళాయి కనెక్షన్‌ ఇవ్వాలి. కొందరు అధికార పార్టీ నాయ కులు సొంతంగా సొమ్ములు వసూలు చేయడంతో ప్రజలు కుళాయి కనెక్షన్‌లు బిగించుకున్నారు. ఇలా పంచాయతీకి నష్టం వాటిల్లింది.

బిల్లులకు కొర్రీ..

పంచాయతీలో నిధులున్నా సర్పంచ్‌ సొంత సొమ్ము లు వెచ్చించాల్సిన దుస్థితి. శానిటరీ సిబ్బందికి, వాటర్‌ ట్యాంక్‌ వద్ద ఉండే సిబ్బందికి ప్రతి నెలా సొంత సొమ్ములు చెల్లిస్తున్నారు. వేతనాలు జాప్యం అవు తుండడంతో పాతవారు మానేస్తున్నారు. పారిశుధ్య కార్మికులను మళ్లీ కొత్తగా నియమించుకోవాల్సి వస్తోం ది. మరోవైపు ఫిల్టర్‌బెడ్‌ల మరమ్మతుల కోసం సొమ్ములు వెచ్చించారు. సీసీ రహదారిని ఏర్పాటు చేశారు. ఇలా సుమారు రూ.23 లక్షలు వెచ్చించారు. ఇవన్నీ సర్పంచ్‌ సొంతంగా సమకూర్చారు. వీటి బిల్లులు మంజూరుకు అధికారులు సహకరించడం లేదు. చివరకు మంచినీటిలో క్లోరినేషన్‌ కోసం బ్లీచింగ్‌ కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఇతర పంచా యతీ నుంచి బ్లీచింగ్‌ను కొంతమేర సరఫరా చేశారే తప్పా పంచాయతీలో ఉన్న నిధులను వెచ్చించి కొను గోలు చేసేందుకు అధికారులు సహకరించడం లేదు. డ్రెయినేజీ సిల్ట్‌ను తొలగించలేకపోతున్నారు. దాంతో దోమలు విజృంభిస్తు న్నాయి. దోమలను అరికట్టేందుకు మలాథియన్‌ను అప్పు చేసి తెచ్చారు. అంతే గానీ ఉన్న నిధులను ఖర్చుపెట్టుకోవడానికి అవకాశం లేకుండా పోతోంది. మొత్తంగా అలంపురం అభివృద్ధిని గాలికొదిలేశారు. సర్పంచ్‌ మాట చెల్లుబాటు అవకుండా కొందరు నాయకులు మోకాలడ్డుతున్నట్టు తెలుస్తోంది.

మునిసిపాలిటీల వారీగా అసెస్‌మెంట్‌లు..

భీమవరం మునిసిపాలిటీలో విలీన గ్రామాలతో కలుపుకుని 35 వేల అసెస్‌మెంట్‌లు ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో 28 వేలు, తణుకులో 22 వేలు, పాలకొల్లు 17,500 నరసాపురంలో 14,460 అసెస్‌మెంట్‌లు ఉన్నాయి. వీటినుంచి ఆస్తి పన్నులు వసూలు చేస్తున్నారు. ఇకపై చెత్తపన్నును ఇందులో విలీనం చేసి వసూలు చేయనున్నారు.

అధికారులు సహకరించడం లేదు..

గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపుతో 10 సీసీ రహదారులకు ప్రతిపాదనలు చేశాం. డ్రెయిన్లు నిర్మించాలని తీర్మానించాం. అందరి వార్డు సభ్యుల సహకారం ఉంటోంది. అంచనాలు రూపొందించాలని తీర్మానించినా అధికారులు పట్టించుకోవడం లేదు. రెండు చెరువులు ఆక్రమణలో ఉన్నాయి. పంచాయతీ వేలం పాట నిర్వహించలేకపోతోంది. ఇప్పటికే సొంత డబ్బులతో జీతాలు ఇస్తున్నాం. అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఇంకెత కాలం ఇలా... ఎందుకు సర్పంచ్‌ అంటే చిన్నచూపు చూస్తున్నారు.

– తాతపూడి ప్రగతి, సర్పంచ్‌

Updated Date - 2023-02-07T00:14:31+05:30 IST