పోలీసు సంఘ జిల్లా నూతన కార్యవర్గం
ABN , First Publish Date - 2023-05-26T00:12:41+05:30 IST
పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు సంఘం గురువారం భీమవరంలో ఎంపికైంది.

భీమవరం క్రైం, మే 25 : పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు సంఘం గురువారం భీమవరంలో ఎంపికైంది. అధ్యక్షుడిగా సీహెచ్‌ఎన్ మోజెస్ (పాలకొల్లు), సీనియర్ ఉపాధ్యక్షుడిగా ఎస్.మార్లింగం (పాలకొల్లు ఏఎస్‌ఐ), ఉపాధ్యక్షుడిగా ఎం.నరసింహారావు (డీఏఆర్, భీమవరం), కార్యదర్శిగా ఏజీఎస్ మూర్తి (ఎస్‌ఐ, కాళ్ళ), సంయుక్త కార్యదర్శిగా కేవీవీ సత్యనారాయణ (వీరవాసరం పీసీ), కార్యనిర్వాహక కార్యదర్శిగా ఐఆర్‌కే రాజు (డీఏఆర్ భీమవరం), కోశాధికారిగా ఎంవీ గంగాధరరావు (నరసాపురం పీసీ), ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా జె.శివప్రసాద్ (పెనుమంట్ర హెచ్‌సీ), ఎ.దుర్గాప్రసాద్ (తణుకు హెచ్‌సీ), సీహెచ్‌ఎస్‌కే శేషుకుమార్ (భీమవరం పీసీ ), కేవీడీఎస్ శంకర్ (ఇరగవరం పీసీ), జి.అంజనీకుమార్ (భీమవరం హెచ్‌సీ), ఎం. అప్పారావు (భీమవరం పీసీ) నియమితులయ్యారు. వీరంతా మర్యాదపూర్వకంగా ఎస్పీ యు.రవిప్రకాశ్‌ను కలిశారు.