సమాజ సేవలే వాకర్స్‌ క్లబ్‌ ధ్యేయం : కృష్ణమూర్తి

ABN , First Publish Date - 2023-03-19T23:27:57+05:30 IST

సమాజ సేవల్లో భాగస్వామ్యం కావడమే వాకర్స్‌ క్లబ్‌ ధ్యేయం అని వాకర్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ శనగన కృష్ణమూర్తి అన్నారు.

సమాజ సేవలే వాకర్స్‌ క్లబ్‌ ధ్యేయం : కృష్ణమూర్తి
వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సీఐను సత్కరిస్తున్న వాకర్స్‌ క్లబ్‌ సభ్యులు

పాలకొల్లు అర్బన్‌, మార్చి 19 : సమాజ సేవల్లో భాగస్వామ్యం కావడమే వాకర్స్‌ క్లబ్‌ ధ్యేయం అని వాకర్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ శనగన కృష్ణమూర్తి అన్నారు. స్థానిక లయన్స్‌ క్లబ్‌ హాల్లో ఆదివారం వాకర్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని పట్టణ సీఐ డి. రాంబాబు ప్రారంభించారు. ముఖ్యఅ తిఽథిగా ఆయన మాట్లాడుతూ వైద్య శిబిరంలో 450 మందికి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. ఏవీఎస్‌ అకాడమీ (చికాగో) సహకారంతో అనన్య జనపరెడ్డి టీమ్‌ సభ్యులను, ముఖ్య అతిథులను అభినందించారు. యూకేసీ ఇంటర్నేషనల్‌ గవర్నర్‌ డాక్టర్‌ ముచ్చర్ల సంజయ్‌, ఆకి రామకృష్ణ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జీవీ సుబ్బారావు, మానం బసవరాజు సేవలు అందజేశారు. రోగులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. క్లబ్‌ సభ్యులు పోతుల ఉమాశంకరరావు, మేడికొండ రామదాసు, జవ్వాజి కళ్యాణ్‌, ఆదుర్తి రాధాకృష్ణ, సుబ్బారాయుడు, జీవీ రవికుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T23:27:57+05:30 IST