ఓటుహక్కు తో సమర్థ పాలకులను ఎన్నుకోవాలి

ABN , First Publish Date - 2023-01-25T00:34:58+05:30 IST

సమర్ధవంతమైన పాలనకు ఓటుహక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. 25న 13వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా భీమవరం రాయలం రోడ్డులో మంగళవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను కలెక్టర్‌ ప్రారంభించారు.

ఓటుహక్కు తో సమర్థ పాలకులను ఎన్నుకోవాలి
రంగవల్లులను పరిశీలిస్తున్న పశ్చిమ కలెక్టర్‌ ప్రశాంతి

కలెక్టర్‌ ప్రశాంతి

భీమవరం, జనవరి 24 : సమర్ధవంతమైన పాలనకు ఓటుహక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. 25న 13వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా భీమవరం రాయలం రోడ్డులో మంగళవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను కలెక్టర్‌ ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ యువత ఓటుహక్కు విషయంలో సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, 18 ఏళ్లు నిండిన ప్రతీ పౌరుడు ఓటును బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఇన్‌చార్జి డీఆర్వో దాసిరాజు మాట్లాడుతూ 25న విష్ణు కళాశాలలో జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తున్నామని, మధ్యాహ్నం 2 గంటల నుంచి బైక్‌ ర్యాలీ జరుగుతుందని తెలిపారు. ముగ్గుల పోటీలలో సుమారు 60 మంది పాల్గొన్నారని బీవీరాజు కళాశాలలో నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు, సీనియర్‌ ఓటర్లకు సత్కారం చేస్తామన్నారు. తహసీల్దార్‌ రవికుమార్‌, చెరుకువాడ రంగసాయి, షిథాల్‌ భవాని, రంగమణి, అమ్యులారావు, ఏసుబాబు, కంతేటి వెంకటరాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:34:59+05:30 IST