వైరల్ జ్వరాలపై..
ABN , First Publish Date - 2023-09-22T00:10:32+05:30 IST
కుక్కునూరు మండలంలో వైరల్ జ్వరాల విజృంభణపై ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. కేఆర్‌పురం ఐటీడీఏ పీవో ఎం.సూర్యతేజ, జిల్లా వైద్యాధికారిణి శర్మిష్ఠ జ్వరపీడిత గ్రామాలైన కుక్కునూరు, కివ్వాక గ్రామాల్లో పర్యటించారు.
అప్రమత్తమైన అధికార యంత్రాంగం
జ్వర పీడిత గ్రామాల్లో ఐటీడీఏ పీవో, జిల్లా వైద్యాధికారి శర్మిష్ఠ
కుక్కునూరు, సెప్టెంబరు 21 : కుక్కునూరు మండలంలో వైరల్ జ్వరాల విజృంభణపై ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం ప్రచురితమైన కథనానికి జిల్లా అధికార యంత్రాంగం స్పందించింది. కేఆర్‌పురం ఐటీడీఏ పీవో ఎం.సూర్యతేజ, జిల్లా వైద్యాధికారిణి శర్మిష్ఠ జ్వరపీడిత గ్రామాలైన కుక్కునూరు, కివ్వాక గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో పారిశుధ్యం, జ్వరాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కివ్వాకలో స్థానికులు మాట్లాడుతూ జ్వరాలు, డెంగీ లక్షణాలతో పలువురు మృతి చెందారని పీవోకు వివరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో ఐటీడీఏ పీవో ఎం.సూర్యతేజ పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుం టున్నట్టు పీవో తెలిపారు. పది రోజులకు సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందించారు. మండలంలోని ప్రతి గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రత్యేకంగా ముగ్గురు వైద్యులను ఏర్పాటు చేయనున్నారు. కివ్వాకలో ఇంటింటికీ వైద్య బృందాలు వెళ్లి జ్వరాలతో ఉన్న వారికి రక్త నమూనాలను సేకరించారు. పరీక్షల్లో డెంగీ కేసులు ఏమీ నిర్ధారణ కాలేదు. యాంటీ లార్వా, బ్లీచింగ్ కార్యక్రమాలు చేపట్టారు. తాగునీటిపై పరీక్షలు జరిపారు. డెంగీకి సంబంధిం చిన ఎన్‌ఎస్–1 కిట్‌లను వైద్య సిబ్బందికి అందుబాటులో ఉంచారు. తహసీల్దా ర్ ప్రమద్వర, ఎంపీడీవో శ్రీనివాస్, వైద్యులు సునీల్, పూర్ణశ్రీనివాస్ పాల్గొన్నారు.