Share News

ప్రశ్నిస్తే నిర్బంధమా?

ABN , First Publish Date - 2023-12-11T00:18:13+05:30 IST

ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న ఉద్యోగ సంఽఘాల నాయ కులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో ఇంతవరకు ఒక్క డీఎస్సీని చేపట్టనందున అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఖాళీగా వున్న 40 వేల టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయాలి’

ప్రశ్నిస్తే నిర్బంధమా?
యూటీఎఫ్‌ రాష్ట్ర నూతన కార్యవర్గానికి ఎన్నికైన నాయకులు

సమస్యల సాధన కోసం రేపటి నుంచే రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణ

ముగిసిన యూటీఎఫ్‌

రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు

ఏలూరు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 10 : ‘ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న ఉద్యోగ సంఽఘాల నాయ కులపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో ఇంతవరకు ఒక్క డీఎస్సీని చేపట్టనందున అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో ఖాళీగా వున్న 40 వేల టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేయాలి’ అంటూ యూటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, పాత పెన్షన్‌ విధానం తదితర కర్తవ్యాలతో ఏలూరులో రెండు రోజులుగా జరుగుతున్న యూటీఎఫ్‌ 49వ రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా పలు అంశాలపై విస్తృత చర్చ జరిగింది. పీడీఎఫ్‌ మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రహ్మణ్యం మాట్లా డుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న నూతన విద్యావిధానం శాస్త్రీయ విద్యను అందించే దిశగా మంచిబడికి పునాదులు వేయాలని కోరారు. ప్రశ్నించే టీచర్లపై నిర్బంధం తగదన్నారు. కార్పొరేట్‌ విద్యాసంస్థలను నియంత్రించాలన్నారు. యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌ మాట్లా డుతూ రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందన్నారు. సీఎం ఇచ్చి న ఏ హామీ అమలు కావడం లేదన్నారు. సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రాథమికోన్నత పాఠశాలల్లో పూర్తిస్థాయి సబ్జెక్టు టీచర్లు లేరని, విద్యార్థులు–ఉపాధ్యాయుడు నిష్పత్తిని తగ్గించడంతో ఉపాధ్యాయులపై పనిభారం, పీరియడ్ల సంఖ్య పెరిగిందని, దీనివల్ల విద్యార్థులూ నష్టపోతున్నారన్నారు. డీఎస్సీ–2008 నోటిఫికేషన్‌లో అర్హత నిబంధనలను మార్చడం వల్ల ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికై కూడా నియామకం పొందలేక పోయిన వారిని కనీస వేతన స్కేలుపై కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగాలు పొందిన ఎంటీఎస్‌ టీచర్లను రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. పాఠశాలలకు విద్యు త్‌ చార్జీలను ఏడాదికాలంగా చెల్లించకపోవడం వల్ల విద్యుత్‌ అధి కారులు టీచర్లపై ఒత్తిళ్లు తెస్తున్నారని ఆరోపిం చారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ప్రభుత్వమే ఉచితంగా విద్యు త్‌ను సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ బిల్లుల ను చెల్లించవద్దని, విద్యుత్‌ అధికారులు ఏవైనా నోటీసులిస్తే ప్రభుత్వ దృష్టికి తీసుకు రావాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సూచించా రు. హెచ్‌ఎంలు, టీచర్లు ఇప్పటికే చెల్లించిన విద్యుత్‌ బిల్లు లను రీయింబర్స్‌మెంట్‌ చేయాలని కోరారు. అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న పాఠశాలలకు అద్దెసొమ్ముని వెంటనే చెల్లించేం దుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలకు ముందు కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులందరినీ రెగ్యులర్‌ చేస్తామని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి రాష్ట్రవిభజనకు ముందు నియమించ బడిన 10,117 మందిని మాత్రమే రెగ్యులర్‌ చేవారని, ఇప్పటికీ 45వేల మందికి పైగా కాంట్రాక్టు, 2.40 లక్షల మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నా రని వీరందరినీ క్రమబద్ధీకరించడంతో పాటు రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగానే ఇంక్రి మెంట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు మెనూ చార్జీలను కనీసం 20శాతం పెంచాలని కోరారు. మున్సిపల్‌ టీచర్లకు బదిలీలు, పదోన్నతులు ఇవ్వాలని, హైస్కూళ్లలో అన్ని పోస్టులను అప్‌ గ్రేడ్‌చేయా లని, పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల ఆరోగ్యబీమా సౌకర్యాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సమగ్ర పరీక్ష విధానాన్ని ప్రకటించాలని కోరారు. మహిళా ఉపాధ్యా యుల కోసం ప్రత్యేకంగా విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల్లో నమ్మకం కలిగించేందుకు బహుముఖ కార్యక్రమాలను చేపట్టాలని రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాల్లో తీర్మానించారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులందరూ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో చదవడం, రాయడం, మాట్లాడడం నేర్పించాలని, దీనిని ఒక సామాజిక కర్తవ్యంగా తీసుకోవాలని టీచర్లకు సూచించారు. మున్సిపల్‌ టీచర్ల సమస్యల సాధన కోసం ఈ నెల 12 నుంచి 30వరకు దశలవారీ ఆందోళనను చేపట్టి 30న రాష్ట్రస్థాయి ధర్నాను నిర్వహించాలని తీర్మానించారు. ప్రజానాట్య మండలి కళా కారుల విప్లవ గీతాలతో కూడిన నృత్య ప్రదర్శ నలు హైలైట్‌ గా నిలిచాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ, యూటీఎఫ్‌ నాయకులు ఎన్‌.వెంకటేశ్వర్లు, 26 జిల్లాల నుంచి సంఘ నాయకులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర కౌన్సిల్‌ సమావేశాలు కొత్త కార్యవర్గ ఎన్నికతో ముగిశాయి.

Updated Date - 2023-12-11T00:18:14+05:30 IST