కబ్జా కోరల్లో..

ABN , First Publish Date - 2023-09-03T23:27:25+05:30 IST

ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న ఉప్పుటేరు గట్లు కోతకు గురై ప్రమాదకరంగా ఉన్నాయి.

కబ్జా కోరల్లో..
ఉప్పుటేరు వెంబడి అనధికార చెరువులు

ఉప్పుటేరు గట్లు ఆక్రమించి చేపలు, రొయ్యల చెర్వులు తవ్వకం

చూసీచూడనట్టుగా అధికారులు

బలహీనంగా మారిన గట్లు

కలిదిండి, సెప్టెంబరు 3 : ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న ఉప్పుటేరు గట్లు కోతకు గురై ప్రమాదకరంగా ఉన్నాయి. ఏ క్షణంలో గండ్లు పడి గ్రామాలను ముంచెత్తుందోనని ఉప్పుటేరు తీర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీ వల వచ్చిన తుఫాన్లకు ఉప్పుటేరు పొంగింది. ఆ సమ యంలో స్థానికులంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఉప్పుటేరు వెంబడి ఇరువైపులా సుమారు 30 గ్రామాలు ఉన్నాయి. సుమారు 50 వేల మంది జనాభా నివశిస్తు న్నారు. ఆకివీడు వంతెన నుంచి పెదలంక శివారు మట్లం వరకు 30 కిలోమీటర్ల మేర ఉప్పుటేరు గట్లను కొంతమంది బడా బాబులు ఆక్రమించి చేపలు, రొయ్యల చెరువులు తవ్వేయడంతో గట్లు బలహీన పడ్డాయి. ఏటిగట్టును ఆక్రమించి చెరువులుగా తవ్వుతున్నా డ్రెయి నేజీ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబం ధిత ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-09-03T23:27:25+05:30 IST