ఉనికిలిలో పిన్నమనేని విగ్రహం ధ్వంసం
ABN , First Publish Date - 2023-09-12T00:10:55+05:30 IST
మండవల్లి మండలం ఉనికిలిలో ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశా రు.
మండవల్లి, సెప్టెంబరు 11: మండవల్లి మండలం ఉనికిలిలో ఉమ్మడి కృష్ణా జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ దివంగత పిన్నమనేని కోటేశ్వరరావు కాంస్య విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి ధ్వంసం చేశా రు. గ్రామంలోని ప్రధాన కూడలిలో జాతిపిత మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు, ఎన్టీ రామారావు, వైఎస్ రాజ శేఖరరెడ్డి విగ్రహాలతో పాటు పిన్నమనేని విగ్రహాన్ని ఏర్పా టు చేశారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు పిన్న మనేని విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో గ్రామంలో ఉత్కంఠ నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తులు ఇలాంటి దుశ్యర్చలకి పాల్పడడం గ్రామస్థులను ఆందోళనకు గురి చేసింది. సమీపంలోని సీసీ కెమె రాల ఆధారంగా విచారణ చేస్తున్నామని, కేసు నమోదు చేస్తామని మండవల్లి ఎస్‌ఐ టి.రామకృష్ణ తెలిపారు.