తెన్నేటికి ఉగాది సాహిత్య పురస్కారం
ABN , First Publish Date - 2023-03-19T23:56:24+05:30 IST
బెంగుళూరులో కర్ణాటక తెలుగు రచయితల ఆధ్వర్యంలో ఆదివారం జాతీయస్థాయిలో ఉగాది సాహిత్య పురస్కార వేడుకలు జరిగాయి.

గణపవరం, మార్చి 19: బెంగుళూరులో కర్ణాటక తెలుగు రచయితల ఆధ్వర్యంలో ఆదివారం జాతీయస్థాయిలో ఉగాది సాహిత్య పురస్కార వేడుకలు జరిగాయి. గణపవరానికి చెందిన కవి, రచయిత తెన్నేటి లక్ష్మీనారాయణమూర్తికి సాహిత్య పురస్కారం లభించింది. తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఉగాది జాతీయ సాహితీ పురస్కారం అందజేశారని తెన్నేటి తెలిపారు. కల్యాణ్ నగర్‌లోని ఇండో ఏషియన్ అకాడమీలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిఽథిగా సీబీఐ మాజీ డైరెక్టర్ వి.వి. లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ‘తేనెలూరు తెలుగు మనది’ అనే వ్యాససంకలనానికి సాహిత్య పురస్కారం లభించింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పట్టుశాలువతో తెన్నేటిని సత్కరించారు. తెలుగేతర రాష్ట్రంలో తెలుగు భాష, సాహిత్యాన్ని పెంచి పోషించటమనేది ఎంతో అభినందనీయమని తెన్నేటి అన్నారు. కర్ణాటక తెలుగు రచయితిల సమాఖ్య సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. కర్ణాటక తెలుగు సమాఖ్య చైర్మన్ బొంగవరపు మాల్యాద్రి యాదవ్, అధ్యక్షుడు జి. చంఢీశ్వర్, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరశాస్ర్తి, ప్రొఫెసర్ పి.ఏకాంబర్ నాయుడు పాల్గొన్నారు.