తాడేపల్లిగూడెం డివిజన్ ఏపీ గ్రామ అధికారుల సంఘం ఎన్నిక
ABN , First Publish Date - 2023-03-20T00:17:43+05:30 IST
నూతనంగా తాడేపల్లిగూడెం డివిజన్ ఏర్పడిన నేపథ్యంలో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఎన్జీవో హోంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ అధికారుల సంఘం ఆధ్వర్యంలో సంఘ ఎన్నికలు నిర్వహించారు.

భీమవరం, మార్చి 19 : నూతనంగా తాడేపల్లిగూడెం డివిజన్ ఏర్పడిన నేపథ్యంలో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న ఎన్జీవో హోంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ అధికారుల సంఘం ఆధ్వర్యంలో సంఘ ఎన్నికలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు నూతన కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు. వీఆర్వోల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేయాలని సభ్యులకు సూచించారు. డివిజన్ అధ్యక్షుడిగా ఆర్.చెల్లయ్య, సెక్రటరీగా వి.ముత్యాలరావు, కోశాధికారిగా సీహెచ్ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఎం.రామోజీ, కేవీవీ సుబ్బారావు, ఎస్.అనూష, జాయింట్ సెక్రటరీలుగా ఎస్.ప్రభువరం, ఎ.శ్రీనివాసు, జి.లలిత కుమారి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా వెంకటేష్, వై.రాజు, వీజే కెనడీ, కార్యవర్గ సభ్యులను ఆరు మండలాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో తాడేపల్లిగూడెం వీఆర్వోలు రాంబాబు, నాగరాజు, పోతురాజు, సురేష్, దేవరాజు, అత్తిలి మండల వీఆర్వోలు కొండబాబు, నాగభూషణం, రామకృష్ణ, ఏకోబు పాల్గొన్నారు.