వైభవంగా తొలి ఏకాదశి పూజలు
ABN , First Publish Date - 2023-06-30T00:37:30+05:30 IST
ఆషాఢమాసంలో హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి పూజలు గురువారం వైభవంగా నిర్వహించారు.
కిటకిటలాడిన దేవాలయాలు
ప్రత్యేక అలంకరణల్లో స్వామి, అమ్మవార్లు
భీమవరంటౌన్, జూన్ 30 :ఆషాఢమాసంలో హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి పూజలు గురువారం వైభవంగా నిర్వహించారు. భీమవరం పట్టణంలోని అమ్మవార్ల ఆలయాల్లో పూజలు నిర్వహించారు. శాకాంబరిదేవి అలంకరణల్లో అమ్మవార్లు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీరాంపురం రోడ్డులో జగన్మాత కనకదుర్గమ్మ, మెం టేవారి తోటలోని బాలత్రిపుర సుందరిదేవి, త్యాగరాజ భవనంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవార్లను శాకాంబరి దేవిగా అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. గునుపూడి సోమేశ్వర జనార్ధనస్వామి దేవస్థానంలోని స్వామి కి 108 ఫైనాపిల్‌తో అలంకరణ చేసి పూజలు చేశారు. జువ్వలపాలెం రోడ్డులోని పద్మావతి వేంకటేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు.
ఆకివీడు/పాలకోడేరు, జూన్ 29: తొలి ఏకాదశి సంద్భంగా ఆకివీడు మాదివాడ వేంకటేశ్వరస్వామి–మల్లేశ్వరస్వామి దేవస్థానాల్లో క్షీరాభిషేకం, వేదపారాయణం చేశారు. పెద్దింట్లమ్మ, వేణుగోపాలస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు. పార్వతీ సమేత వెంకటలింగేశ్వరస్వామి దేవస్థానంలో వారాహి మాతకు భక్తులు ఆషాఢమాస సారె అందజేశారు. పాలకోడేరు మండలంలోని పలు గ్రామాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
నరసాపురం టౌన్, జూన్ 29: నరసాపురం పట్టణ, మండలంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కుమ్మరవీధి రామాలయం, స్టీమర్ రోడ్, ఎంబర్‌మన్నార్, జగన్నాథస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించారు.
పాలకొల్లు అర్బన్:క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో క్షేత్రపాలకుడు లక్ష్మీ జనార్దన స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. కెనాల్ రోడ్డులోని వేంకటేశ్వర స్వామిని పలు రకాల పండ్లతో అలంకరించారు. శంభన్న అగ్రహారంలోనూ, డైలీ మార్కెట్‌లోనూ వేంకటేశ్వర స్వామివారి ఆలయాల్లోనూ, అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం, పంచముఖాంజనేయ స్వామి ఆలయం, సాయిబాబా అలయాల్లోనూ పూజలు నిర్వహించారు. రంగమన్నారు పేట పాండురంగస్వామి ఆలయంలో భారీ అన్నసమారాధన నిర్వహించారు.
తణుకు/అత్తిలి : తొలి ఏకాదశి పూజలు భక్తులు ఘనంగా నిర్వహిం చారు. గురువారం ఉదయం నుంచి విఘ్నేశ్వరుడి ఆలయం, వేంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు పలు ఆలయాలు భక్తులతో దర్శనమిచ్చాయి. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్తిలి మండలంలో బుల్లి తిరుపతిగా పేరుగాంచిన ఈడూరు వరాల వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. మూల విరాట్‌కు 200 లీటర్ల ఆవు పాలు తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని జరిపారు. ఆలయంలో అన్నసమా రాధన నిర్వహించారు.
పెంటపాడు:పెంటపాడు బాల వేంకటేశ్వరస్వామి ఆలయంలో అర్చకులు అగ్నిహోత్రం సత్యకిరణ్, కొడవటిగంటి జగన్నాథాచార్యులు స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త ఎస్‌టీవీ సుధాకర్ పాల్గొన్నారు. కే.పెంటపాడు భైరాగిమఠం గోపాలస్వామి ఆంజనేయస్వామి వారి ఆలయంలో అర్చకులు త్రిలోచనదాస్, పూర్ణచంద్ర త్రిపాఠి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఫిట్‌పర్సన్ చీమలకొండ సాయి ఏర్పాట్లను పర్యవేక్షించారు.