నేడు వైద్య కళాశాల ప్రారంభం

ABN , First Publish Date - 2023-09-15T00:00:49+05:30 IST

ఏలూరులో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించ నున్నారు.

నేడు వైద్య కళాశాల ప్రారంభం
ఏలూరులో ప్రారంభం కానున్న ప్రభుత్వ వైద్య కళాశాల

ఏలూరు క్రైం, సెప్టెంబరు 14 : ఏలూరులో ఏర్పాటు చేసిన ప్రభుత్వ వైద్య కళాశాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించ నున్నారు. విజయనగరం నుంచి ఆయన వర్చువల్‌గా ప్రారంభించి ఇక్కడ వున్న వైద్య విద్యార్థులతో మాట్లాడనున్నారు. ఏలూరు మెడికల్‌ కళాశాలలో 150 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు చేరడానికి ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ అనుమతి ఇచ్చింది. ఇప్పటికే 120 మంది అడ్మిషన్లు పొందారు. 2021 మే 31న సీఎం జగన్‌ వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేశారు. రూ. 220 కోట్లతో నిర్మాణం చేపట్టనున్నారు. ఏలూరు డీఎంహెచ్‌వో కార్యాలయంలో రెండేళ్లపాటు వైద్యవిద్యతరగతులు నిర్వహించడానికి తాత్కాలిక భవనాలను ఏర్పాటు చేశారు. 150 మంది విద్యార్థులకు బాలికలు, బాలురకు వేర్వేరుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న ఎంసీహెచ్‌ బ్లాక్‌పై తాత్కాలికంగా హాస్టళ్లను ఏర్పాటు చేశారు. శాశ్వత మెడికల్‌ కళాశాల భవనాలను ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో నిర్మిస్తున్నారు.

Updated Date - 2023-09-15T00:00:49+05:30 IST