టీడీపీ–జనసేన కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
ABN , Publish Date - Dec 30 , 2023 | 12:40 AM
టీడీపీ–జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చే ఎన్నికలలో సైనికుల్లా పనిచేయాలని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు పిలుపునిచ్చారు.
ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు
ఉండి, డిసెంబరు 29 : టీడీపీ–జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చే ఎన్నికలలో సైనికుల్లా పనిచేయాలని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం ఉండిలో బాబు ష్యూరిటీ–భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు. ఇస్త్రీ చేసే షాపు యజమాని వద్దకు వెళ్లి మ్యేనిఫెస్టోను వివరించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం–జనసేన సంయుక్తంగా పనిచేసి విజయం సాధించాలన్నారు. టీడీపీ గ్రామ అధ్యక్షుడు కాగిత బుజ్జి, పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు కరిమెరక నాగరాజు, కిన్నెర వెంకన్న, క్లస్టర్ ఇన్‌చార్జులు పేరిచర్ల బాలరాజు, జుత్తుగ శ్రీను, మోపిదేవి శ్రీను, గొట్టుముక్కల శ్యాంప్రసాద్‌రాజు, కర్రి శ్రీను, గురుగుబిల్లి సత్యనారాయణ, తదితరులు ఉన్నారు.
సీఎం జగన్‌ది నమ్మక ద్రోహం : ఎమ్మెల్యే నిమ్మల
పాలకొల్లు టౌన్ : ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నివర్గాల ప్రజలకు నమ్మకద్రోహం చేశారని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయు డు అన్నారు. పాలకొల్లు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చింది గోరంత దోచుకుంది కొండంత అని ఎద్దేవా చేశారు. జగన్ హామీలలో 85 శాతంపైగా అమలుకు నోచుకోలేదన్నారు. ఈ ప్రభుత్వం బీసీ, మత్స్యకార, ఎస్సీ, చేనేత, చిరు వ్యాపారులు, కాపు, ఆర్యవైశ్య, మైనారిటీ, క్షత్రియ, క్రిస్టియన్ మైనారిటీ అన్ని వర్గాలతో పాటు రైతాంగం, ఉద్యోగులను మోసం చేసిందన్నారు.
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి : పొత్తూరి
నరసాపురం, డిసెంబరు 29: రాష్ర్టాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, మ్యేనిఫెస్టోలోని హామీలన్నీ అమలు చేస్తామని టీడీపీ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు అన్నారు. శుక్రవారం పట్టణంలోని ఆదర్శనగర్‌లో జనసేన, టీడీపీ నాయకులతో కలిసి ‘బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీవి చెప్పేవని అబద్దాలని, వాటిని నమ్మి మరోసారి మోసపోయి ఓటు వేయొద్దన్నారు. కొప్పాడ రవి, కొల్లు పెద్దిరాజు, గంటా కృష్ణ, మావూరి ఆనంద్, పరుపు బుజ్జిబాబు, బండారు ప్రసాద్, పట్టా మోహన్, దినేష్, హరి తదితరులు పాల్గొన్నారు.
దళిత గ్రామాలు రోడ్లకూ నోచుకోలేదు : టీడీడీ ఎస్సీ సెల్ నాయకులు
పాలకొల్లు రూరల్ : జగన్ పాలనలో దళిత గ్రామాలు కనీసం సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు కూడా నోచుకోలేదని టీడీపీ ఎస్సీసెల్ నాయకులు ధ్వజమెత్తారు. పూలపల్లిగ్రామ దళితవాడల్లో శుక్రవారం దళిత పథకాల రద్దుపై ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. దళిత నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 27 రకాల దళితుల సంక్షేమ పథకాలు రదు చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమికి మద్దతు పలకాలని కోరారు. టీడీపీ, జనసేన ఎస్సీ సెల్ నాయకులు పాముల రజనీకుమార్, తాళ్ల నాగరాజు, సబ్బే పుష్పరాజు, మేలా దుర్గాప్రసాద్, నాగాబత్తుల దాసు, అందే కోటి వీరభద్రం, గుబ్బల హరిప్రసాద్ పాల్గొన్నారు.