మహాశక్తిపై టీడీపీ నేతల ప్రచారం
ABN , First Publish Date - 2023-07-30T23:23:54+05:30 IST
మహాశక్తి పేరిట టీడీపీ మేనిఫెస్టోలో పొం దుపరిచిన మహిళా సంక్షేమ పథకాలను నేతలు ప్రచారం చేశారు.
బుట్టాయగూడెం, జూలై 30: మహాశక్తి పేరిట టీడీపీ మేనిఫెస్టోలో పొం దుపరిచిన మహిళా సంక్షేమ పథకాలను నేతలు ప్రచారం చేశారు. నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ సూచలు మేరకు ఆదివారం అచ్చియ్య పాలెం పంచాయతీలోని గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు పంచుతూ టీడీపీ నాయకులు ప్రచారం చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే మహిళ అభివృద్ధికి చేపట్టబోయే పథకాలను మహిళలకు వివరించారు. మొగపర్తి సోంబాబు, యంట్రప్రగడ శ్రీనివాసరావు, గద్దె అబ్బులు, సున్నం నాగేశ్వరావు, జారం చాందినీ విద్యాసాగరిక, జిల్లా మహిళా అధ్యక్షురాలు చిం తల వెంకటరమణ, కుంజం సుభాషిణి, రమాదేవి, మడకం కన్నపరాజు, దెయ్యాల కృష్ణమోహన్, మడకం రామకృష్ణ, కోర్స వెంకటేశ్వరావు, పసుమర్తి భీమేశ్వరావు, గన్నిన సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.