కొడాలి నాని బహిరంగ క్షమాపణ చెప్పాలి

ABN , First Publish Date - 2023-05-31T23:21:29+05:30 IST

మాజీ మంత్రి కొడాలి నాని కాపులపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని టీడీపీ కాపు సామాజికవర్గ నాయకులు హెచ్చరించారు.

కొడాలి నాని బహిరంగ క్షమాపణ చెప్పాలి
ఆందోళన చేస్తున్న టీడీపీ కాపు నాయకులు

తాడేపల్లిగూడెం అర్బన్‌, మే 31: మాజీ మంత్రి కొడాలి నాని కాపులపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని టీడీపీ కాపు సామాజికవర్గ నాయకులు హెచ్చరించారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నాని వ్యాఖ్య లను ఖండించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ కాపులకు నాని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆయనను సీఎం జగన్‌ పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. గంధం సతీష్‌, పసల కొండ, ఎరుబండి సతీష్‌, కుదుళ్ళ చంద్రశేఖర్‌, గంధం గిరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:21:29+05:30 IST