రాష్ట్రంలో అరాచక పాలన
ABN , First Publish Date - 2023-07-21T00:05:35+05:30 IST
రాష్ట్రంలో జగన్ అరాచక పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ ప్రభుత్వ తీరును టీడీపీ నియోజక వర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన టీడీపీ నేతలు
పోలవరం, జూలై 20 : రాష్ట్రంలో జగన్ అరాచక పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైసీపీ ప్రభుత్వ తీరును టీడీపీ నియోజక వర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాసులు విమర్శించారు. పోలవరంలో టీడీపీ మహాశక్తి చైతన్య రథంలో గురువారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ పాలనలో మహిళలపై జరుగుతున్న అరాచకాలకు అంతులేకుండా పోయిందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా వారి స్వయం ఉపాధి లక్ష్యం గా టీడీపీ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు ఆర్థికంగా ఎదిగేలా ప్రణాళికలు రూపొందిండం జరిగిందని టీడీపీ మేనిఫెస్టో ప్రజలకు వివరించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ గెలిపించాలని కోరారు. టీడీ పీ మండల అధ్యక్షుడు బొడ్డు కృష్ణ, కుంచే దొరబాబు, జిల్లా మహిళా అధ్య క్షురాలు చింతల వెంకటరమణ, జారం చాందిని, విద్యా సాగరిక, గౌరి, చిన్నారి, ఆకుల రమణ, పెండ్యాల రమాదేవి, కుంజం సుభాషిణి, నునకాని రాంబాబు, పోతుల శ్రీను, పాదం ప్రసాద్, మంగిన కొండ, ఎస్.సుధీర్, కొండే ఏసు, పిల్లి నాగరాజు, జల్లేపల్లి జితేంద్ర, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ద్వారకాతిరుమల: టీడీపీ మినీ మేనిఫెస్టో పాటు, వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ కార్యకర్తలను గోపాలపురం నియో జకవర్గ ఇన్‌చార్జి మద్దిపాటి వెంకట్రాజు కోరారు. గురువారం కొమ్మరలో పార్టీ మినీ మేనిఫెస్టో, భవిష్యత్‌కు గ్యారెంటీని ‘మన ఇంటికి మన మద్దిపాటి’ పేరున ప్రచారం చేసేందుకు ఆయన పర్యటించారు. పార్టీ మండల అధ్యక్షు డు లంకా సత్యనారాయణ నేతృత్వంలో గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కూలీలతో మమేకమయ్యారు. జగన్ పాలనకు విసిగిపోయిన ప్రజలు టీడీపీ ప్రభుత్వం కోసం ఎదురుచూ స్తున్నారన్నారు. లంకా సత్తిపండు, మల్లిపెద్ది వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి చందు, మటపర్తి బద్రి, మానుకొండ శ్రీను, మానూరి బాలకృష్ణ, ప్రసాద్, ఏపూరి కిషోర్, పాకలపాటి మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.