Share News

వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి

ABN , First Publish Date - 2023-12-04T00:24:52+05:30 IST

వైసీపీ పాలనతో రాష్ట్రం అధోగతిపాలైందని టీడీపీ మండల కార్యదర్శి మాదు రవికుమార్‌ అన్నారు. వేగివాడలో ఆదివారం బాబు ష్యూరిటీ– భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు.

వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి
పోలవరం మండలంలో మేనిఫెస్టో వివరిస్తున్న బొరగం

పెదవేగి, డిసెంబరు 3: వైసీపీ పాలనతో రాష్ట్రం అధోగతిపాలైందని టీడీపీ మండల కార్యదర్శి మాదు రవికుమార్‌ అన్నారు. వేగివాడలో ఆదివారం బాబు ష్యూరిటీ– భవిష్యత్‌ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు ఇంటింటికి తిరిగి టీడీపీ మేనిఫెస్టో వివరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించి, రాష్ట్ర మనుగడకు తిరిగి పునాది వేయాలని ఆయన సూచించారు. పార్టీ నాయకులు చేకూరి భగవాన్‌, నేతల సతీష్‌, వేముల కొండ, లక్ష్మణరావు, చిగురుపల్లి అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.

పోలవరం: మండలంలోని ఎల్‌ఎన్‌డీ.పేటలో టీడీపీ నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాసులు నాయకత్వంలో భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్ర మం జరిగింది. ఇంటింటికీ తిరిగి టీడీపీ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు వివ రించారు. గుబ్బా రాంబాబు, ఇళ్ల సత్యనారాయణ, దాసరి రవి, కపిలవాయి సత్యనారాయణ, కపిలవాయి శేఖర్‌, బొమ్మా చినకామరాజు, మాతు సాంబశివరావు, ఎంఎస్‌ వెంకటేశ్వరరావు ఇతర నాయకులు పాల్గొన్నారు.

కొయ్యలగూడెం: గ్రామస్థాయి నుంచి టీడీపీ బలోపేతానికి మహిళలు కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి గంగిరెడ్ల మేఘలాదేవి అన్నారు. భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ మేనిఫెస్టో అం శాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. తెలుగు మహిళా నాయకులు దుర్గాదేవి, రమ, తదితరులు ఉన్నారు.

ఏలూరు టూటౌన్‌: చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బడుగు, బలహీనవర్గాలకు న్యాయం చేకూరుతుందని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు ఆంజనేయులు అన్నారు. బాబు ష్యూరిటీ, భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమం ఆదివారం 5వ డివిజన్‌లో జరి గింది. ఇంటింటికి తిరిగి భవిష్యత్‌ గ్యారెంటీ పత్రాలు అందజేశారు. మినీ మేనిఫెస్టో అంశాలపై ప్రజలు ఆకర్షితులవుతున్నారని అన్నారు.

Updated Date - 2023-12-04T00:24:54+05:30 IST