రాష్ట్రంలో రాక్షస పాలన

ABN , First Publish Date - 2023-09-18T00:09:23+05:30 IST

రాష్ట్రంలో రాక్షస పాలన కొనసా గిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడిం చాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బడేటి చంటి పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో రాక్షస పాలన
కె.కోటలో ప్రార్థన చేస్తున్న ఘంటా మురళి, నేతలు

టీడీపీ శ్రేణుల నిరాహార దీక్ష, నిరసన ప్రదర్శనలు

చంద్రబాబు విడుదల కావాలని చర్చిలో ప్రార్థనలు

ఏలూరు టూటౌన్‌, సెప్టెంబరు 17: రాష్ట్రంలో రాక్షస పాలన కొనసా గిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని రాబోయే ఎన్నికల్లో చిత్తుగా ఓడిం చాలని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి బడేటి చంటి పిలుపునిచ్చారు. చంద్ర బాబు నాయుడు అరెస్టుపై ఆదివారం నిరసన కార్యక్రమాలు కొనసాగిం చారు. శాంతినగర్‌ మన్నా చర్చ్‌లో టీడీపీ నాయకులతో కలిసి చంటి ప్రార్థ నలు చేశారు. పాస్టర్‌ జ్యోతిరాజు దీవెన, ఆశీర్వాదాలు ఇచ్చారు. అనంతరం చేపలతూము సెంటర్‌లో రిలే నిరాహార దీక్షల్లో చంటి పాల్గొన్నారు. జగన్‌ పాలనలో మత ఘర్షణలు, కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని ధ్వజమె త్తారు. చంద్రబాబు కడిగిన ముత్యంలా జైలు నుంచి బయటకు వస్తారని, రాబోయే ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి అవడం ఖాయమ న్నా రు. కార్యక్రమంలో జిల్లా క్రిస్టియన్‌సెల్‌ అధ్యక్షుడు జుంజు మోజేష్‌, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టి.నరసాపురం: చంద్రబాబు విడుదల కోరుతూ తిరుమలదేవిపేటలో తెలుగుయువత రాష్ట్ర కార్యదర్శి తోట లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం పలు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబునె అరెస్టు చేయడం దుర్మార్గం అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. తోట కృష్ణమూర్తి, తోట శ్రీను, శనగవరపు సత్యనారాయణ, మన్నెం దుర్గారావు, బొక్కా సిద్దార్థ, అబ్బ దాసరి వెంకటేశ్వరరావు, అబ్బ దాసరి పండు తదితరులు పాల్గొన్నారు.

కొయ్యలగూడెం: టీడీపీ చేపట్టిన నియోజకవర్గ స్థాయి రిలే నిరాహార దీక్షలు ఆదివారం ఆరో రోజు కొనసాగాయి. బుట్టాయిగూడెం మండల నాయ కులు, కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేసిన మహనీయుడని అరెస్టు చేయడం దారుణమన్నారు. రాబోయే ఎన్ని కల్లో టీడీపీ, జనసేన అధికారంలోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. దీక్ష చేపట్టిన వారిలో నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్‌, కాకర్ల సురేష్‌, బుట్టాయిగూడెం మండల అధ్యక్షుడు సోముబాబు, మొడియం సూర్యచంద్రం, గద్దే అబ్బులు, శ్రీను పాల్గొన్నారు. సాయంత్రం దీక్షలో కూర్చున్న వారికి పారేపల్లి రామారావు, గొడవర్తి విద్యాసాగర్‌, పెనుమత్స శ్రీనివాసరాజు, పారేపల్లి నరేష్‌, జ్యేష్ట రామకృష్ణ తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.

భీమడోలు: చంద్రబాబు నాయుడు బెయిల్‌పై సురక్షితంగా బయటకు రావాలని కోరుతూ భీమడోలులో టీడీ పీ శ్రేణులు, దళిత వర్గాలు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక టీడీపీ నేత దళిత నాయకులు మరియన్న ఆధ్వర్యంలో వంద కొబ్బరికాయలు కొట్టి చంద్రబాబునాయుడు బయటకు రావాలని కోరుతూ మొక్కలు తీర్చుకున్నారు. గన్ని వీరాంజనేయులు పాల్గొని ప్రార్థనలు చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన నారా చంద్రబాబునాయుడు బెయిల్‌పై బయటకు వస్తారన్నారు. జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు, జన సేన, సీపీఎం, కమ్యూనిస్టులు, ఎంఆర్‌పీఎస్‌, తదితర పార్టీల నేతలంతా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతున్నారన్నారు. ఆలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. భీమడోలులో కార్యక్రమం నిర్వహించి నట్లు ఆయన తెలిపారు. దళిత నాయకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. శేషపు శేషగిరి, సుబ్రమణ్యం, మాజేటి సత్యనారాయణ, ఈతకోట తాతాజీ, మరియన్న, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

కామవరపుకోట: చంద్రబాబు నాయుడు విడుదల కోరుతూ మండ లంలో టీడీపీ శ్రేణులు చర్చిలలో పాస్టర్లు, ఫాదర్లు ఆదివారం ప్రత్యేక ప్రార్థ నలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ, టీడీపీ మండల అధ్యక్షుడు కిలారు సత్యనారాయనల పర్యవేక్షణలో చంద్రబాబు విడుదల కోరుతూ పలు గ్రామాల్లో చర్చిల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తాడిచర్ల చర్చి వద్ద సర్పంచ్‌ పసుమర్తి పార్ధసారధిబాబు ఆధ్వర్యంలో, కొత్తూరు ఆర్‌సిఎం చర్చి వద్ద మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ మిత్రబృందం చంద్రబా బు విడుదల కోరుతూ ప్రార్థనలు చేశారు. గుంటుపల్లి చర్చి వద్ద టీడీపీ నాయకులు బేతిన వెంకట్రావు, సర్పంచ్‌ గోరింక దాసు, కంఠమనేని సత్యనా రాయణ, ఎంపిటిసి కంఠమనేని పుష్పరాజ్యం ప్రార్థనలు చేశారు. ఆడమిల్లి చర్చి వద్ద సర్పంచ్‌ గూడపాటి కేశవరావు మిత్రబృందం ప్రార్థనలు చేశారు. వీరిశెట్టిగూడెం, తడికలపూడి, కళ్ళచెరువు, కె.ఎస్‌.రామవరం, అంకాలంపాడు, తదితర గ్రామాల్లో కూడా చర్చిల వద్ద టీడీపీ శ్రేణులు ప్రార్థనలు చేశారు.

Updated Date - 2023-09-18T00:09:23+05:30 IST