Share News

టీడీపీతోనే రాష్ట్రానికి భవిష్యత్‌

ABN , First Publish Date - 2023-11-22T00:06:38+05:30 IST

అప్పులమయమైన రాష్ట్రం తిరిగి అభివృద్ధి సాధించాలంటే టీడీపీ జిల్లా కార్యదర్శి మోరు శ్రావణి అన్నారు. రాష్ర్టానికి బాబు గ్యారంటీ కార్యక్రమాన్ని రాజుపేట, తోటగూడెం గ్రామాల్లో మంగళ వారం నిర్వహించారు.

టీడీపీతోనే రాష్ట్రానికి భవిష్యత్‌
వేలేరుపాడు మండలం రామవరంలో టీడీపీ నేతల ప్రచారం

మినీ మేనిఫెస్టోతో పార్టీ నేతల ప్రచారం

పెదపాడు, నవంబరు 21: అప్పులమయమైన రాష్ట్రం తిరిగి అభివృద్ధి సాధించాలంటే టీడీపీ జిల్లా కార్యదర్శి మోరు శ్రావణి అన్నారు. రాష్ర్టానికి బాబు గ్యారంటీ కార్యక్రమాన్ని రాజుపేట, తోటగూడెం గ్రామాల్లో మంగళ వారం నిర్వహించారు. పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందని తెలియజేశారు. మిని మేనిఫెస్టో అంశాలను ప్రజలకు వివ రించారు. గుత్తా అనిల్‌, కొత్తూరు చినబాబు, గుండపనేని కళ్యాణ్‌, అక్కినేని వంశీకృష్ణ, పెద్దిరెడ్డి రమేష్‌, పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

వేలేరుపాడు: ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు కొద్ది నెలల్లోనే పరిష్కారం లభిస్తుందని, జగన్‌ ప్రభుత్వం అరాచక పాలనకు చరమగీతం పాడాలని టీడీపీ నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాసులు అన్నారు. మండలంలోని రామవరంలో భవిష్యత్‌కు బాబు భరోసా కార్యక్ర మాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటింటికీ తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. టీడీపీని అధికారంలోకి తెచ్చేందుకు అందరూ కృషి చేయా లని, ప్రజల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. కట్టం రాంబాబు, కొమ్మన వెంకటేశ్వర్లు, శ్రీరాములు, ముత్యాలరావు, చాపర్ల శ్రీను, బేతా మల్లిఖార్జున్‌, సలీమ్‌, పాయం వినోద తదితరులు పాల్గొన్నారు.

కొయ్యలగూడెం: టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్న సంక్షేమ పథకాలతో మహిళలు ఎంతో సాధిస్తారని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘలాదేవి అన్నారు. మండలంలోని పాత పరింపూడిలో ఆమె మహిళలతో కలసి భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మేని ఫెస్టోలో పేర్కొన్న పథకాలన్ని ప్రజలందరికి ఎంతో ఉపయోగపడతాయ న్నారు. ఈ పథకాలన్ని అమలవ్వాలంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. అనంతరం ఇంటింటికి వెళ్ళి మేనిఫెస్టో వివరించారు. మహిళా నాయకులు దుర్గాదేవి, కొత్తారమా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-22T00:06:40+05:30 IST