చంద్రబాబును ముఖ్యమంత్రి చేస్తేనే అభివృద్ధి సాధ్యం
ABN , First Publish Date - 2023-11-10T23:31:32+05:30 IST
చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రం లో అభివృద్ధి సాధ్యమని టీడీపీ నేతలు అన్నారు. జిల్లాలో పలు గ్రామాల్లో శుక్రవారం బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వ హించారు.
గ్రామాల్లో టీడీపీ శ్రేణుల ప్రచారం
దెందులూరు, నవంబరు 10: చంద్రబాబును ముఖ్యమంత్రిని చేస్తేనే రాష్ట్రం లో అభివృద్ధి సాధ్యమని టీడీపీ నేతలు అన్నారు. జిల్లాలో పలు గ్రామాల్లో శుక్రవారం బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వ హించారు. దెందులూరు మండలం గాలాయగూడెంలో జరిగిన కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగిన సత్తా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉంద న్నారు. పూజారి శ్రీనివాసరావు, ఏనుగు రామకృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి కర్రపత్రాలను పంపిణీ చేశారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెడుతు నే ఉన్నారని, ఎన్ని కేసులు పెట్టినా చంద్రబాబు ముందు చూపు, సంక్షేమం, చేసిన అభివృద్ధి ముందు పని చేయవన్నారు. గెలిచే పార్టీ టీడీపీ–జనసేన కూటమి అన్నారు. కార్యక్రమంలో అందే మహంకాళి, మాగంటి నారాయణ ప్రసాద్, మోతుకూరి నాని, పూజారి దుర్గారావు, మద్దల దయానందరాజు, కొప్పాక విజయ్‌కుమార్, టీడీపీ నేతలు పాల్గొన్నారు.
బుట్టాయగూడెం: మండలంలోని అంతర్వేదిగూడెంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు శుక్రవారం నిర్వహిం చారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ మినీ మేనిఫెస్టో ప్రజలకు వివరించారు. బాబు అధికారంలోకి వస్తే అన్నివర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. వైసీపీ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. సున్నం నాగేశ్వరావు, మొడియం సింగరాజు, కొమరం మల్లేశ్వరావు, పసుమర్తి భీమేశ్వరరావు, చిలకమూడి సుధాకర్, ఆండ్రూ శ్యామ్‌కుమార్, బాడిస ముత్యాలరావు, చోడెం ప్రసాద్, చోడెం అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
జీలుగుమిల్లి: రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే చంద్ర బాబుతోనే సాధ్యమని నియోజకవర్గ కన్వీనర్ బొరగం శ్రీనివాస్ అన్నారు. దర్భ గూడెంలో భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ అధికా రం లోకి వస్తే అమలు చేసే పథకాలను ప్రజలకు వివరించి కరపత్రాలు పంచారు. బాసిన రాజబాబు, తమ్మన సాంబశివరావు, పైడిమాల కృష్ణ, పీతల వెంకటేశ్వ రరావు, అక్కిశెట్టి బలరాం, పద్దం వెంకటకృష్ణ, కొర్స దుర్గారావు, తమ్మన నాగేశ్వరావు, అలవాల గంగిరెడ్డి, మొడియం రమేష్, పంపన వెంకటేశ్వరావు, గుడిపూటి చిరంజీవి, కనుమూరి సంపత్ ఉన్నారు.
భీమడోలు: పోలసానపల్లిలో భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అద్యక్షుడు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. ఇటింటికి తిరిగి టీడీపీ పథకాల ప్రయోజనాలను వివరించారు. తెలుగుదేశం హయాంలో పేదల అభివృద్ధికి చంద్రబాబు ప్రకటించిన భవిష్యత్ గ్యారెంటీ దిశానిర్ధేశాన్ని చూపుతుందన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.