చంద్రబాబుకు అధికారంతోనే భవిష్యత్ గ్యారెంటీ
ABN , First Publish Date - 2023-11-10T00:09:46+05:30 IST
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యమని, ప్రజల్ భవిష్యత్ గ్యారెంటీ అని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొరగం శ్రీనివాసులు అన్నారు.
టీడీపీ మేనిఫెస్టోతో నేతల ప్రచారం
టి.నరసాపురం, నవంబరు 9: రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి చంద్రబాబు తోనే సాధ్యమని, ప్రజల్ భవిష్యత్ గ్యారెంటీ అని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బొరగం శ్రీనివాసులు అన్నారు. టి.నరసాపురంలో బాబు షూరిటీ భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం మినీ మేనిఫెస్టో ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు జయ్యవరపు శ్రీరామమూర్తి, శీలం వెంకటేశ్వరరావు, మండల అధ్యక్షుడు నా యుడు రామకృష్ణారావు గౌడ్, నల్లూరి వెంకట చలపతిరావు, తోట లక్ష్మీ నారాయణ, వాసిరెడ్డి మోహన్‌రావు, సందేపూడి సాయి, పిన్నమనేని మధు, పెద్దిన సత్యనారాయణ, జోనుబోయిన సోంబాబు, కొండపల్లి రవి, అను మోలు శ్రీనివాసరావు, దాసరి చంద్రశేఖర్, కొరివి వెంకటేశ్వరరావు, మోదుగు రామారావు, రాచబంటు వేములయ్య, తదితరులు పాల్గొన్నారు.
చింతలపూడి: మండలంలో పాత చింతలపూడి, ప్రగడవరం, ఎర్రగుంటపల్లి గ్రామాల్లో భవిష్యత్ గ్యారెంటీ బాబు ష్యూరిటి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళి టీడీపీ నేతలు కరపత్రాలు అందజేశారు. పాత చింతలపూడిలో బోడా నాగభూషణం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మహాశక్తి, అన్నదాత, యువగళం, బీసీలకు రక్షణ చట్టం, ఇం టింటికీ రక్షిత నీరు, పూర్ టూ రిచ్ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. బోడా అనీష్‌కుమార్, ముళ్ళగిరి అచ్చయ్య, కె.రాజారత్నం, గన్నమనేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రగడవరంలో తాళ్ళూరి చంద్రశేఖర రెడ్డి, చక్రపు మారేశ్వరరావు, ఎర్రగుంటపల్లిలో గోలి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు.
పెదవేగి: టీడీపీ అధికారంలోకి వస్తేనే పేదల భవిష్యత్‌కు గ్యారెంటీ అని సర్పంచ్ తాతా శ్రీరామ్మూర్తి అన్నారు. పెదవేగిలో గురువారంరాత్రి బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ నాయకులు ఇంటింటికి తిరిగి టీడీపీ ప్రకటించిన మినీ మేనీపెస్టో అంశాలను ప్రజలకు వివరించారు. శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ వైసీపీ పాల న అవినీతిమయం అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులు, దౌర్జన్యా లు చేస్తున్నారని ఆయన విమర్శించారు. పేదల సంక్షేమం అంటూ మాటల గారడీతో ప్రతి పేదవానిపై మోయలేని అప్పుల భారాన్ని పెట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలన్నారు. తాతా సత్యనారాయణ, కంచెన మోహనరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కామవరపుకోట: ఆడమిల్లిలో గురువారం రాత్రి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాబు షురిటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. సర్పంచ్ గూడపాటి కేశవరావు, బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు జిజ్జూరి బాబ్జీ, గంపాల శ్రీనివాసరావు, మిడతా నరేష్ నాయుడు, నాగబాబు, పిండి పుల్లారావు, జంపాల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ద్వారకాతిరుమల: రాష్ట్రాభివృద్ది, ప్రజాసంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని నియోజకవర్గ ఇన్‌చార్జ్ మద్దిపాటి వెంకట్రాజు అన్నారు. ద్వారకా తిరుమలలో గురువారం రాత్రి భవిష్యత్‌కు గ్యారంటీ కార్యక్రమం లంకా సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఎస్సీ కాలనీలో ఇంటింటికి తిరిగి కర పత్రాలను పంపిణీ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. మల్లిపెద్ది వెంకటేశ్వరరావు, మటపర్తి బద్రి తదితరులు పాల్గొన్నారు.