దోషులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2023-07-12T23:49:32+05:30 IST

పులిరాముడుగూడెం గిరిజన సంక్షేమ ఆశ్ర మ బాలుర పాఠశాల విద్యార్థి గోగుల అఖిల్‌ వర్ధనరెడ్డి హత్య జరిగి రెండు రోజులైనా దోషులను పట్టుకోవడంలో జగన్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ ఆరోపించారు.

దోషులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలం
అఖిల్‌ వర్ధనరెడ్డి తల్లిదండ్రులతో మాట్లాడుతున్న బొరగం శ్రీనివాస్‌

హత్యకు గురైన బాలుడి తల్లిదండ్రులకు బొరగం పరామర్శ

బుట్టాయగూడెం, జూలై 12: పులిరాముడుగూడెం గిరిజన సంక్షేమ ఆశ్ర మ బాలుర పాఠశాల విద్యార్థి గోగుల అఖిల్‌ వర్ధనరెడ్డి హత్య జరిగి రెండు రోజులైనా దోషులను పట్టుకోవడంలో జగన్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని టీడీపీ నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ ఆరోపించారు. బుధవారం ఆశ్రమ పాఠశాలను సందర్శించి బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థి మృతికి సంతాపం తెలిపారు. హాస్టల్‌ నుంచి వెళ్లిపోవాలని పిల్లలను భయపెట్టేలా మృతుడి చేతిలో లేఖ ఉంచిన దుండగులను కఠినంగా శిక్షిం చాలన్నారు. వసతిగృహాల పిల్లల రక్షణపై ఆందోళన వ్యక్తం చేశారు. దొరమామిడి సరుగుడు ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలో 11 నెలల బాలుడు కిడ్నాప్‌కు గురై 10 రోజులు దాటుతున్నా ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని తెలిపారు. మొగపర్తి సోంబాబు, సున్నం నాగేశ్వరావు, తామా నాగేశ్వరావు తదితరులు ఉన్నారు.

విద్యార్ధి మృతికి కారకులైన దోషులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఏటీఏ నాయకులు జలగం రాంబాబు, సరియం నాగేశ్వరావు, తెల్లం రాము లు, వంజం ధర్మరాజు, సోదెం రాజు, ఆదివాసీ సంక్షేమ పరిషత్‌ నాయకులు టి.లక్ష్మణ్‌, పూసం శ్రీను, తెల్లం శ్రీనివాసరావు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కె.లెని న్‌, వంశీ, సాయి, జగదీష్‌ డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి రూ.30 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, హెచ్‌ఎం, వార్డెన్‌, వాచ్‌మెన్లను ఉద్యోగం నుంచి తొలగించాలని కోరారు. పీడీఎస్‌యూ నాయకుడు ఎస్‌.రామ్మోహన్‌, న్యాయవాది యు.ఏసుబాబులు హత్యపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు.

Updated Date - 2023-07-12T23:49:32+05:30 IST