ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టాలి

ABN , First Publish Date - 2023-03-19T23:17:00+05:30 IST

జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న అరాచకాలు, దుర్మాగాలను సోషల్‌ మీడియాలో ఎండగడుతూ ప్రజల్ని చైతన్యపర్చాలని టీడీపీ నరసాపురం ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ అరాచకాలను ఎండగట్టాలి
నరసాపురం సమావేశంలో మాట్లాడుతున్న పొత్తూరి రామరాజు

నరసాపురం, మార్చి 19: జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న అరాచకాలు, దుర్మాగాలను సోషల్‌ మీడియాలో ఎండగడుతూ ప్రజల్ని చైతన్యపర్చాలని టీడీపీ నరసాపురం ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు పిలుపునిచ్చారు. అదివారం పార్టీ కార్యాలయంలో ఐటీడీపీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పని చేయాలన్నారు. ఇందుకు సోషల్‌ మీడియాను ఎంచుకుని ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. సమావేశంలో ఐటీడీపీ అధ్యక్షుడు దొంగ పద్మారావు, జక్కంశెట్టి బాలాజీ, టీడీపీ నాయకులు జక్కం శ్రీమన్నారాయణ, వాతాడి ఉమా, కొల్లు పెద్దిరాజు, పాలూరి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

భీమలాపురంలో తెలుగు యువత గ్రామ కమిటీ ఎన్నిక..

ఆచంట, మార్చి19 : టీడీపీ అధికారంలోకి రావడానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్‌బాబు సూచించారు. భీమలాపురం గ్రామంలో తెలుగు యువత గ్రామ కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కౌరు త్రిమూర్తులు, కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. అనంతరం తెలుగు మహిళా గ్రామ కమిటీని ఎన్నుకున్నారు. కేతా మురళి, ఎంపీపీ దిగుమర్తి సూర్యకుమారి, కేతా మీరయ్య, తమ్మినీడి ప్రసాద్‌, బీరా నర్శింహమూర్తి, సర్పంచ్‌ గుబ్బల మాధవరావు ఉన్నారు.

ఆకివీడులో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’

ఆకివీడు, మార్చి 19: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం టీడీపీదేనని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు రుజువు చేశారని మండల–పట్టణ అధ్యక్షులు మోటుపల్లి రామవరప్రసాద్‌, బొల్లా వెంకట్రావు అన్నారు. ఆదివారం స్థానిక ఏడో వార్డులో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’లో భాగంగా టీడీపీ శ్రేణులు పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్‌ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఓటమి తప్పదన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ గొంట్లా గణపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి గంధం ఉమా, ఎండీ జాకీర్‌, మోపిదేవి శ్రీను, ఎండీ అజ్మల్‌, కిమిడి నాగరాజు తదితరుల ఉన్నారు.

Updated Date - 2023-03-19T23:17:00+05:30 IST