వైసీపీ అంతానికి నాంది

ABN , First Publish Date - 2023-03-19T00:25:27+05:30 IST

ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయంపై పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. జిల్లా అంతటా పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్‌లు కట్‌ చేశారు.

వైసీపీ అంతానికి నాంది
కార్యకర్తకు మిఠాయి తినిపిస్తున్న చింతమనేని ప్రభాకర్‌

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై టీడీపీ సంబరాలు

ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయంపై పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. జిల్లా అంతటా పార్టీ నాయకులు, కార్యకర్తలు కేక్‌లు కట్‌ చేశారు. స్వీట్లు పంచిపెట్టారు. వైసీపీ అరాచకాలకు విద్యా వంతులు అడ్డుకట్ట వేశారని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందనడానికి నిదర్శనమని పలువురు టీడీపీ నాయకులు అన్నారు.

భీమడోలు మార్చి 18 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించ డంతో భీమడోలులో ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అద్యక్షుడు గన్ని వీరాంజనేయులు నేతృత్వంలో భీమడోలు గ్రామంలో గాంధీబొమ్మ సెంటర్‌ నుంచి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. పలు సెంటర్లలో కేక్‌కట్‌ చేశారు. సైకో పోవాలి సైకిల్‌ రావాలంటూ నృత్యాలు చేశారు. గన్ని మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి ఇది నాంది అన్నారు. కొండబాబు, మురళీకృష్ణ, పుల్లయ్య నాయుడు, పెద్దిరాజు, యడ్లపల్లి రామ కృష్ణ, శేషపుగిరి, గంజి మజేష్‌, ఈతకోట బాబీ, ఆదిరెడ్డి సత్యనారాయణ, పడాల నాగేశ్వరరావు, దుంగా రమణ, రమేష్‌ పాల్గొన్నారు.

పెదవేగి /ఏలూరు రూరల్‌ : ప్రజావ్యతిరేక నిర్ణయాలకు ఈ ఫలితాలే నిదర్శనమని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. జగన్‌ దెబ్బకు పరిశ్రమలు పరారయ్యాయని, చదువుకున్న యువత ఉద్యోగా వకాశాల కోసం పక్క రాష్ట్రాలకు పరుగులు పెట్టాల్సి వస్తోందని ఇవన్నీ చూసిన యువత జగన్‌కు ఓటుతో బుద్ది చెప్పారన్నారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో టీడీపీ విజయానికి సూచిక అని అన్నారు. ఏలూరు రూరల్‌ మండలం గుడివాకలంక గ్రామంలో పార్టీ నాయకులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ మండల అధ్యక్షుడు నంబూరి నాగరాజు, నేతల రవి, సైదు గోవర్ధన్‌, మోరు విజయరామరాజు, నేపాల జగపతిబాబు, ఘంటసాల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

ఏలూరు కార్పొరేషన్‌ : ప్రభుత్వంపై వ్యతిరేకత ఎమ్మెల్సీ ఎన్నికలు రుజువు చేశాయని జనసేన జిల్లా అధికార ప్రతినిధి రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు.వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఇంటి బాట పట్టించడం ఖాయమని స్పష్టం చేశారు. రాఘవయ్యచౌదరి, సిరిపల్లి ప్రసాద్‌, అల్లు సాయిచరణ్‌, ఈశ్వరరావు, శ్రీను, రాజేష్‌ ఉన్నారు.

కామవరపుకోట : ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీరామకృష్ణ అన్నారు.వచ్చే ఎన్నికల్లో మరింత పరాభవం తప్పదన్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు కిలారు సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ ఘంటా సుధీర్‌బాబు, ఎస్సీ సెల్‌ నాయకులు కొయ్యగూర వెంకటేష్‌, టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఖాన్‌ వజీర్‌ తదితరులు ఉన్నారు.

చింతలపూడి : చింతలపూడి పట్టణ టీడీపీ శాఖ ఆధ్వర్యంలో అంబే డ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పట్టణశాఖ అధ్య క్షుడు పక్కాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ భూస్థాపితానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. కొత్తపూడి శేషగిరిరావు, మారుమూడి థామస్‌, సుందరమ్మ, టి.భాస్కర్‌, రాజేంద్ర కపూర్‌, నందిపాం నాగేశ్వరరావు, నాగ భూషణం, అనీష్‌కుమార్‌, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం : ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పేందుకు పట్టభద్రుల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని జంగారెడ్డిగూడెం పట్టణం టీడీపీ అధ్యక్షుడు రావూరి కృష్ణ అన్నారు. పట్టణ పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. పెనుమర్తి రామ్‌కుమార్‌, బొబ్బర రాజ్‌పాల్‌కుమార్‌, కరుటూరి రమాదేవి, పగడం సౌభాగ్యవతి తూటికుంట రాము, నంబూరి రామచంద్ర రాజు, ఆకు మర్తి రామారావు,దత్తాత్రేయ, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

బుట్టాయగూడెం : 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీదే విజయమని పోలవరం నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం శ్రీనివాస్‌ అన్నారు. పట్టభద్రులు ప్రజాస్వామ్య పరిరక్షణకు, వైసీపీ దమనకాండ పాలనకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికల్లో అరకు, పాడేరు నియోజకవర్గాల పరిశీలకునిగా పనిచేయడం విజయంలో భాగస్వామి కావడం సంతోషంగా ఉందన్నారు.

లింగపాలెం : లింగపాలెంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గరిమళ్ళ చలపతిరావు, ఎస్సీసెల్‌ అధ్యక్షుడు పల్లి శ్రీను, గుత్తా సత్యసాయి వర ప్రసాద్‌, మోరంపూడి మల్లిఖార్జునరావు, చెన్ను శ్రీనివాస యాదవ్‌, పలు వురు నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేశారు

పెదపాడు : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ మూడు స్థానాల్లో ఘన విజయం సాధించడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. అప్పనవీడులో టీడీపీ నాయకులు వేమూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంచి పెట్టారు.

కొయ్యలగూడెం : మండలంలోని బయ్యన్నగూడెంలో కేకుకట్‌ చేసి మిఠాయిలు పంచారు. మాజీ ఏఎంసీ చైర్మన్‌ పారేపల్లి రామారావు మాట్లా డుతూ వైసీపీ ప్రభుత్వం ఎన్ని అవంతరాలు సృష్టించినా టీడీపీకే ఓటు వేశారన్నారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. మిరియాల ముత్తయ్య, శ్రీను ఉన్నారు.

ఉంగుటూరు : ఉంగుటూరులోని టీడీపీ కార్యాలయంలో శనివారం వేడుకలు నిర్వహించారు. కార్యకర్తలు బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. తెలుగు యువత కన్వీనర్‌ రెడ్డి సూర్యచంద్రరావు, ఉప సర్పంచ్‌ పాతూరి జగదీష్‌, బండారు మధు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:25:27+05:30 IST