టీడీపీలో నూతనోత్సాహం

ABN , First Publish Date - 2023-03-19T00:08:06+05:30 IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించినందున టీడీపీ భీమవరం కార్యాలయంలో శనివారం పార్టీ నాయకులు విజయోత్స వేడుకలు నిర్వహించారు.

టీడీపీలో నూతనోత్సాహం
తణుకు నరేంద్ర సెంటర్‌లో కేక్‌ కట్‌ చేసిన ఆరిమిల్లి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవ సంబరాలు

బాణసంచా కాల్చి స్వీట్ల పంపిణీ

భీమవరం అర్బన్‌, మార్చి 18: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించినందున టీడీపీ భీమవరం కార్యాలయంలో శనివారం పార్టీ నాయకులు విజయోత్స వేడుకలు నిర్వహించారు. తొలుత జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాక్షసపాలనకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ పట్టభద్రలు వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఎమ్మెల్సీ టీడీపీ అభ్యర్థులు ఉత్తరాంధ్ర వేపాడ చిరంజీవి, తూర్పు రాయలసీమ కంచర్ల శ్రీకాంత్‌, పశ్చిమ రాయలసీమ భూమిరెడ్డి రాంగోపాల్‌ రెడ్డిలకు విజ్ఞతతో ఓటు వేసిన పట్టభద్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులుగా పాల్గొన్న రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ళ నాగేశ్వరావులను ప్రశంసించారు. టీడీపీ నాయకులు సయ్యద్‌ నసీమా బేగం, మాదాసు కనకదుర్గ, ఎండీ షబీనా, బి.పద్మ, గునుపూడి తిరుపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆకివీడు : టీడీపీ మంగళగిరి కార్యాలయంలో శనివారం జరిగిన ఎమ్మెల్సీ విజయాల సంబరాల్లో ఎమ్మెల్యే మంతెన రామరాజు కార్యకర్తలు పా ల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబును కలిసి మాట్లాడారు. రాష్ట్ర మైనార్టీ సభ్యుడు ఎండీ జాకీర్‌, బచ్చు కృష్ణ, ఎండీ అజ్మల్‌ తదితరులు ఉన్నారు.

ఉండి:ఉండి టీడీపీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, గ్రామ అధ్యక్షుడు కాగిత బుజ్జి ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గ బాధ్యతలు తీసుకుని ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపునకు కృషి చేశానని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు తెలిపారు. అనంతరం ఉండి సెంటర్‌లో బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ సాగిరాజు సాంబశివరాజులతో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

పెనుగొండ : పెనుగొండ పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గాంఽధీ బొమ్మల సెంటర్‌లో కేక్‌ కట్‌ చేసి బాణసంచా కాల్చి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆచంట జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్‌బాబు, పెనుగొండ సర్పంచ్‌ నక్కా శ్యామలా సోని, కటికిరెడ్డి నానాజీ, వేండ్ర రాము, మండా ప్రసాద్‌, నక్కా వేద వ్యాస శాస్త్రి, పులుగోరి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆచంట : కొడమంచిలిలో పలు చోట్ల బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. మాజీ సర్పంచ్‌ చిలుకూరి శ్రీను, భాలం వెంకట రమణ, చిలుకూరి పట్టాభిరామయ్య, కె.రామకృష్ణ, కట్టా సుబ్బారావు, శ్రీనివాసు తదితరులు ఉన్నారు.

నరసాపురం టౌన్‌ : నరసాపురం టీడీపీ కార్యాలయంలో మిఠాయిలు పంచిపెట్టి, బాణసంచా కాల్చారు. పశ్చిమ రాయలసీమ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన పొత్తూరి రామరాజును సత్కరించారు. అనంతరం పొత్తూరి మాట్లాడు తూ ఇది తెలుగు ప్రజల విజయమన్నారు. టీడీపీ అగ్నికుల క్షత్రియ రాష్ట్ర కన్వీనర్‌ కొప్పాడ రవి మాట్లాడారు. పార్టీ నాయకులు జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు, వాతాడి ఉమా, గుబ్బల నాగరాజు, జోగి పండు, షేక్‌ హుసేన్‌, బర్రె మురళి, పద్మ, సంకు భాస్కర్‌, మల్లాడి మూర్తి తదితరులు పాల్గొన్నారు.

వీరవాసరం : ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ సత్తా చాటిందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు, ఎంపీపీ వీరవల్లి దుర్గాభవాని తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఉత్తరపాలెం ఎంపీపీ దుర్గాభవాని నివాసంలో సంబరాలు నిర్వహించారు. మండలశాఖ అధ్యక్ష కార్యదర్శులు కొల్లెపర శ్రీనివాసరావు, వీరవల్లి శ్రీనివాసరావు, యరకరాజు గోపాలకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు,

తణుకు నరేంద్ర సెంటర్‌లో..

తణుకు : రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుతున్నారనడానికి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ఫలితాలే నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. శనివారం నరేంద్ర సెంటర్‌ వద్ద కేక్‌ కట్‌ చేసి, చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం చేసి, బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. పార్టీ నాయకులు ిపితాని మోహన్‌, గోపిశెట్టి రామకృష్ణ, అబ్బదాసరి లాజర్‌, తమరాపు రమణమ్మ, ఇందిరాదేవి, తేతలి సాయి, నాగరాజు గంగారావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T00:08:06+05:30 IST