Share News

కళ్లు తెరువు..జగన్‌

ABN , First Publish Date - 2023-11-19T23:55:35+05:30 IST

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలుగుదేశం, జనసేన నాయకులు మండిపడ్డారు.భీమవరంలో ఆదివారం తెలుగుదేశం, జనసేన నాయకులు రహదారులపై నిరసన తెలిపారు

కళ్లు తెరువు..జగన్‌
భీమవరంలో గోతులు పడ్డ రహదారిపై నిరసన తెలుపుతున్న తెలుగుదేశం, జనసేన నాయకులు

రహదారి గుంతలపై టీడీపీ, జనసేన నిరసన

భీమవరం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి) : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రహదారులు పూర్తిగా ధ్వంసమయ్యాయని తెలుగుదేశం, జనసేన నాయకులు మండిపడ్డారు. రహదారి ప్రమాదాలు జరుగుతున్నా సరే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తూర్పారబట్టారు. భీమవరంలో ఆదివారం తెలుగుదేశం, జనసేన నాయకులు రహదారులపై నిరసన తెలిపారు తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామ లక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి చిన్న బాబుల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారులను అభి వృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమైందని తోట సీతారామలక్ష్మి పేర్కొన్నారు. తెలుగుదేశం, జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారు లను అభివృద్ధి చేస్తామని చిన్నబాబు తెలిపారు. ఇరు పార్టీల నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, చెనమల్ల చంద్రశేఖర్‌, రేవు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-19T23:55:37+05:30 IST