రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం తధ్యం

ABN , First Publish Date - 2023-03-19T23:23:16+05:30 IST

పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ ప్రలోభాలకు గురిచేసినప్పటికీ టీడీపీకి పట్టం కట్టడాన్ని చూస్తే రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమని అర్ధమవతుందని పార్టీ మండల అధ్యక్షుడు దెందుకూరి ఠాగూర్‌ కోటేశ్వరరాజు, పార్టీ యూనిట్‌ అధ్యక్షుడు కమ్మిలి రాంబాబు అన్నారు.

రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం తధ్యం
గొల్లలకోడేరులో టీడీపీ నాయకుల సంబరాలు

పాలకోడేరు, మార్చి 19 : పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ ప్రలోభాలకు గురిచేసినప్పటికీ టీడీపీకి పట్టం కట్టడాన్ని చూస్తే రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమని అర్ధమవతుందని పార్టీ మండల అధ్యక్షుడు దెందుకూరి ఠాగూర్‌ కోటేశ్వరరాజు, పార్టీ యూనిట్‌ అధ్యక్షుడు కమ్మిలి రాంబాబు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ గొల్లలకోడేరులో టీడీపీ గ్రామ అధ్యక్షుడు కాజా వీరాస్వామి, టీడీపీ నాయకులు కార్యకర్తలు ఆధ్వర్యంలో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం టీడీపీ నాయకులు కోటిరాజు, కమ్మిలి రాంబాబు, ఖాజా వీరస్వామి మాట్లా డారు. సాలా మల్లేశ్వరరావు, కొండపల్లి ఏసురత్నం, జుత్తిగ శ్రీను, తంగిళ్ళ శ్రీను, రౌతు సత్యనారాయణ, గాదిరాజు బోసు, బాపిరాజు పాల్గొన్నారు.

మొగల్తూరులో టీడీపీ సంబరాలు

మొగల్తూరు, మార్చి 19 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన సందర్భంగా మొగల్తూరు టీడీపీ శ్రేణులు సంబరాలు అంబరాన్నంటాయి. స్ధానిక గాంధీబొమ్మల సెంటర్‌లో బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచారు. టీడీపీ మండల అధ్యక్షుడు గుబ్బల నాగరాజు, పట్టణ అధ్యక్షుడు బస్వాని ఏడుకొండలు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుం దనడానికి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమన్నారు. జిల్లా నాయకుడు కలిదిండి కుమార్‌బాబు, డొల్లా రత్నంరాజు, బొల్లా చంటి, కత్తిమండ ముత్యాలరావు, పాలా రాంబాబు, వి.పుల్లారావు, ఎం.శ్రీను పాల్గొన్నారు.

ఆచంట కచేరి సెంటర్‌లో...

ఆచంట, మార్చి 19 : ఆచంట కచేరి సెంటర్‌లో శనివారం రాత్రి బాణసంచా కాల్చి స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్‌బాబు, ఎంపీటీసీ తమ్మినీడి పృధ్వీ, చిలుకూరి సీతారామ్‌, కేతా మురళి, చిలుకూరి ప్రభాకరరావు, మొనవర్తి ప్రసాద్‌, కేతా రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - 2023-03-19T23:23:16+05:30 IST