బాబుతోనే మేము
ABN , First Publish Date - 2023-09-26T00:27:11+05:30 IST
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా జిల్లాలో తెలుగుదేశం చేపట్టిన దీక్షలకు మద్దతు రోజు రోజుకూ పెరుగుతోంది

వివిధ వర్గాల నుంచి మద్దతు
చంద్రబాబు అరెస్టుపై నిరసనలు
13వ రోజుకు చేరిన రిలేదీక్షలు
(భీమవరం–ఆంధ్ర జ్యోతి)
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా జిల్లాలో తెలుగుదేశం చేపట్టిన దీక్షలకు మద్దతు రోజు రోజుకూ పెరుగుతోంది. అన్ని వర్గాల నుంచి దీక్షకు సంఘీభావం చెపుతున్నారు. కులవృత్తులు, చేతివృత్తుల కార్మికులు మద్దతు ప్రకటిస్తున్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను ఎండగడుతున్నారు. బాబుతోనే మేము అంటూ నినదిస్తున్నారు. భీమవరంలో సోమవారం దీక్షలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నాయి. ఎన్టీఆర్ సోదరుని మనవడు శాంతవ్ దీక్షను సందర్శించారు. అక్రమ అరెస్ట్‌కు పాల్పడినంత మాత్రాన తెలుగుదేశం వెనుకంజ వేయదన్నారు. తెలుగుదేశం పార్టీకి అన్ని వర్గాల నుంచి అండదండలు ఉన్నాయని తేల్చి చెప్పారు. తాడేపల్లిగూడెంలో వలబాబ్జి నేతృత్వంలో నల్లబెలూన్లు ఎగురవేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి పాలన కొనసాగిస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ప్రజలకు తెలిపే విధంగా నియోజకవర్గంలో 50 వేల కరపత్రాలను పంపిణీ చేయనున్నట్టు బాబ్జి తెలిపారు.రూరల్ గ్రామాల్లో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. నిరసన కార్యక్రమం చేపడుతుంటే పోలీసులు ఫోటోలు తీయడంలో బిజీగా గడిపారు. నిరసనకారుల ఫోటోలను తీసి ఉన్నతాధికారులకు నివేదించారు. తణుకులో పార్టీ శ్రేణులు వినూత్న నిరసన తెలిపాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు చెవిలో పూలు, వేపాకులు పెట్టుకుని దీక్ష చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సంఘీభావం తెలిపారు. పాలకొల్లులో చేనేత కార్మికులకు చంద్రబాబుకు అండగా నిలిచారు. దీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబుతోనే తామంతా ఉంటామంటూ నినాదాలు చేశారు. చేనేతి కార్మిక ప్రతినిధులు పట్టం గణేష్, శాగ సత్యనారాయణ, బీరకాయ ప్రసాద్, అందే కోటిలింగం తదితరులు పాల్గొన్నారు. నర్సాపురం దీక్షలో శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్, నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజులు కూర్చున్నారు. అక్రమ అరెస్ట్‌లతో తెలుగుదేశం విజయాన్ని అడ్డుకోలేర ని వ్యాఖ్యానించారు. ఉండి, ఆచంటలోనూ తెలుగుదేశం నాయకులు దీక్ష చేపట్టి నిరసన తెలిపారు.
ప్రజలు వాస్తవాలు గ్రహించాలి
తణుకు, సెప్టెంబరు 25 : చంద్రబాబు అక్రమ అరెస్టు విషయంలో ప్రజలు వాస్తవాలు గ్రహించాలని మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. సోమవారం సాయంత్రం తణుకు రాష్ట్రపతి రోడ్డులోని షాపులు, మార్కెట్‌లో తోపడు బండ్లు వద్ద మహిళలకు కరపత్రాలు పంచారు. అక్రమ అరెస్టు గురించి వివరించారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. 92612 92612 నంబర్‌కు డయల్ చేసి చంద్రబాబకుకు మద్దతు ప్రకటించాలని చెప్పారు. వల్లూరి గంగారావు. నల్ల భాస్కరరావు, మేడికొండ నాగయ్య, చిట్టూరి సాయిబాబా, మల్లిన రాధాకృష్ణ, ఇందిరాదేవి తదితరులు పాల్గొన్నారు.
,