పన్ను వసూళ్లలో రికార్డు
ABN , First Publish Date - 2023-04-03T00:04:05+05:30 IST
ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ ఈసారి పురపాలక సంఘాల్లో పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి నెలాఖరు నాటికి 91 శాతం పన్ను వసూళ్లు చేశారు.
మార్చి నెలాఖరుకు 91 శాతం వసూళ్లు
మొదటి స్థానంలో తణుకు
నరసాపురం, ఏప్రిల్ 2: ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నప్పటికీ ఈసారి పురపాలక సంఘాల్లో పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చి నెలాఖరు నాటికి 91 శాతం పన్ను వసూళ్లు చేశారు.ఇదే వసూళ్లలో ఆల్‌టైం రికార్డు. మొత్తం జిల్లాలోని ఆరు పురపాలక సంఘాల్లో రూ.63.65 కోట్లు డిమాండ్ ఉండగా రూ.54.39 కోట్లు వసూలు చేశారు. మొదటి స్ధానంలో తణుకు నిలిచింది. ఇక్కడ రూ 11.80 కోట్లు డిమాండ్ ఉండగా రూ.10.91 కోట్లు వసూలు చేశారు. ఆ తరువాత స్ధానంలో నరసాపురం నిలిచింది. రూ.5.11 కోట్లు డిమాండ్ ఉండగా రూ.4.61 కోట్లు వసూలు చేశారు. పాలకొల్లులో రూ.8.23 కోట్లు డిమాండ్ ఉండగా రూ.6.22 కోట్లు వసూలు చేశారు. ఈఏడాది కూడా ముందస్తు పన్ను వసూళ్లు 5 శాతం రిబేట్ ప్రకటించారు. ఏడాది పన్ను ఒకేసారి చెల్లిస్తే దానిపై ఐదు శాతం రాయితీ వస్తుంది. ఈ ఏడాది పన్ను వసూళ్ళల్లో కూడా చివరిలో ప్రభుత్వం వడ్డీ మినహాయింపు ప్రకటించింది. చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకుని బకాయిలు క్లియర్ చేసుకున్నారు. పురపాలక సంఘాల వారీగా వసూళ్లు ఇలా ఉన్నాయి
మునిసిపాలిటీ డిమాండ్ వసూళ్ళు
తణుకు 11.80 10.91
నరసాపురం 5.11 4.61
ఆకివీడు 2.49 2.22
భీమవరం 21.35 18.92
తాడేపల్లిగూడెం 14.61 11.47
పాలకొల్లు 8.28 6.22