తపన ఫౌండేషన్‌ సేవలు విస్తృతం

ABN , First Publish Date - 2023-03-23T00:15:36+05:30 IST

తపన ఫౌండేషన్‌ సేవలను జిల్లా వ్యాప్తంగా మరింత విస్తృతం చేస్తామని ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు గారపాటి సీతారామంజనేయ చౌదరి అన్నారు.

తపన ఫౌండేషన్‌ సేవలు విస్తృతం
ఉగాది పురస్కారాలు అందించిన తపన చౌదరి

సంస్థ వ్యవస్థాపకుడు సీతారామాంజనేయ చౌదరి

ఏలూరు టూటౌన్‌, మార్చి 22 : తపన ఫౌండేషన్‌ సేవలను జిల్లా వ్యాప్తంగా మరింత విస్తృతం చేస్తామని ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు గారపాటి సీతారామంజనేయ చౌదరి అన్నారు. బుధవారం ఏలూరులోని పద్యావతి కన్వెన్షన్‌ సెంటర్‌లో ఫౌండేషన్‌ 15వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫౌండేషన్‌ ద్వారా సమాజానికి, పేదలకు, విద్యార్థులకు సేవలందించటం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సేవల్ని మరింత విస్తృతం చేస్తామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిఽథులుగా సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌, బుల్లితెర సీనియర్‌ నటి హరిత పాల్గొన్నారు. ఫౌండేషన్‌ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలు, చౌదరి దంపతుల జీవిత విశేషాలను తెలిపే విధంగా అనంతశ్రీరామ్‌ రాసిన పాటను ఆవిష్కరించారు. ఫౌండేషన్‌ ద్వారా లబ్ధిపొందిన పలువురు విద్యార్థులు తమ అభిప్రాయాలను తెలిపారు. అనంతరం ఉగాది పురస్కారాలను కొండపల్లి పండు, కట్టా లక్ష్మి, అల్లం వెంకటసుబ్బారావు, వీరమల్లు మధుసూదనరావులను గారపాటి చౌదరి, రేణుక దంపతులు మెమొంటోలు అందజేసి ఘనంగా సన్మానించారు.

Updated Date - 2023-03-23T00:15:36+05:30 IST