బేటీ బచావో..బేటీ పడావో ర్యాలీ

ABN , First Publish Date - 2023-03-02T23:48:49+05:30 IST

బేటి బచావో – బేటి పడావో కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

బేటీ బచావో..బేటీ పడావో ర్యాలీ
మొగల్తూరులో ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

పాలకొల్లు అర్బన్‌, మార్చి 2: 21వ శతాబ్ధంలో కూడా ఆడపిల్లల్ని కాపాడుకోవడానికి కష్టపడటం విచారకరమని వైద్యాధికారులు డాక్టర్‌ జాన్‌ లియో, డాక్టర్‌ అడ్డాల ప్రతాప్‌ కుమార్‌ అన్నారు. హౌసింగ్‌ బోర్డు కాలనీలోని సుభాష్‌ చంద్రబోస్‌ హైస్కూల్‌ వద్ద గురువారం బేటి బచావో – బేటి పడావో కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీలతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హైస్కూల్‌ హెచ్‌ఎం కృష్ణారావు, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీలు పాల్గొన్నారు.

పాలకోడేరు: బేటి బచావో బేటీ పడావో అనే నినాదంతో పాలకోడేరు, గొరగనమూడి, కుముదవల్లి గ్రామాలలోని పాఠశాలల్లో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్‌ రంగం నాయుడు, సీహెచ్‌వో సత్యనారాయణ, సూపర్‌వైజర్లు శంకర్‌, అయ్యప్ప శ్రీనివాస్‌, చండీరాణి, నాగమణి, అమ్మాజీ, హెల్త్‌ అసిస్టెంట్లు ఎం విజయప్రసాద్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

మొగల్తూరు: మొగల్తూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు దినేష్‌ స్థానిక ఉన్నత పాఠశాలలో విద్యార్థినిలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్‌వీఆర్‌ మూర్తిరాజు, డాక్టర్‌ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-02T23:48:49+05:30 IST