విద్యార్థి అదృశ్యం

ABN , First Publish Date - 2023-09-26T00:53:12+05:30 IST

ముదినేపల్లి ప్రభుత్వ బీసీ బాలుర వసతిగృహంలో ఉంటూ స్థానిక జడ్పీ హైస్కూల్‌లో ఏడవ తరగతి చదువుతున్న బోయిన హరికృష్ణ (12) అనే విద్యార్థి అదృశ్యమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.

విద్యార్థి అదృశ్యం

ముదినేపల్లి, సెప్టెంబరు 25 : ముదినేపల్లి ప్రభుత్వ బీసీ బాలుర వసతిగృహంలో ఉంటూ స్థానిక జడ్పీ హైస్కూల్‌లో ఏడవ తరగతి చదువుతున్న బోయిన హరికృష్ణ (12) అనే విద్యార్థి అదృశ్యమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం మండవల్లి మండలం అయ్యవారి రుద్రవరం గ్రామానికి చెందిన హరికృష్ణ ఈ నెల 17న హాస్టల్‌ నుంచి ఇంటికి వెళ్లాడు. అప్పటి నుంచి ఇంటి వద్దే ఉన్న హరికృష్ణను అతని తాత ఆదినారాయణ ఈ నెల 22 ఉదయం ముదినేపల్లి హైస్కూలుకు పంపి వెళ్లిపోయాడు. స్కూలు సమయం పూర్తయ్యే వరకు ఉన్న ఆ విద్యార్థి తిరిగి అయ్యవారి రుద్రవరం ఇంటికి వెళ్లలేదు. హాస్టల్‌కు వెళ్లలేదు. హరికృష్ణ హాస్టల్‌కు వెళ్లని విషయాన్ని తెలుసుకున్న కుటుంబసభ్యులు మూడు రోజులుగా అతని ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలి తం లేకపోవటంతో ఆదివారం సాయంత్రం ముదినేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై సోమవారం కేసు నమోదు చేసి సీఐ కృష్ణకుమార్‌ పర్యవేక్షణలో ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐ ప్రియకుమార్‌ దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో శుక్రవారం సాయంత్రం హరికృష్ణ కైకలూరు బస్సు ఎక్కినట్లు తెలిసింది. అయితే ఆ విద్యార్థి మండవల్లిలో దిగకుండా ఎక్కడికి వెళ్లాడనేది ఆరా తీస్తున్నారు. హరికృష్ణ అదృశ్యంపై హెచ్‌డబ్ల్యుఓ సురేష్‌ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2023-09-26T00:53:12+05:30 IST